చంద్రబాబు సొమ్ము చేసుకుంటున్నారు: వడ్డే తీవ్ర వ్యాఖ్య

Posted By:
Subscribe to Oneindia Telugu
బిజెపిలో చంద్రబాబు చిచ్చు

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బులు చేసుకుంటున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆరోపిచారు. విజయవాడలో గురువారం పోలవరంపై కృష్ణా డెల్టా పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

తనను భగీరథుడిగా పిలిపించుకోవడానికి చంద్రబాబు ప్రతి ఒక్కరి దృష్టిని పోలవరం వైపు మళ్లిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని ప్రాజెక్టుల ద్వారా చంద్రబాబు, ఆయన జట్టు డబ్బులు చేసుకుంటున్నట్లు వడ్డే ఆరోపించారు.

Chandrababumaking money through Polavaram: Vadde Sobhanadriswara Rao

పోలవరం ప్రాజెక్టును 2108నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు తనకు తాను తనకోసం పెట్టుకున్న గడువు అని ఆయన అన్నారు. నాణ్యతపై దృష్టి పెట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సమావేశంలోని వక్తలంతా అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2018 లేదా 2019 అంటూ గడువు పెట్టడం సరి కాదని అన్నారు. ప్రాజెక్టు నాణ్యతపై, నిర్వాసితుల పునరావాసంపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the name of Polavaram project, Chandrababu and his colleagues have been making money, alleged ex-MP Vadde Sobhanadriswara Rao.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి