ఏపీలో బిజెపికి ఏమీ లేదు, ఆ పార్టీ అండతోనే అన్యాయం: బాబు
అమరావతి: మరో పార్టీ అండతోనే బిజెపి ఏపీ రాష్ట్రంలో అరాచకానికి పాల్పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఉభయసభల్లో నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి ఎంపీలు చేసిన ఆందోళన, ఎంపీల ఆరోగ్య పరిస్థితులపై చంద్రబాబునాయుడు ఆరా తీశారు.
గురువారం రాత్రి పూట పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు వ్యక్తం చేసిన ఎంపీలను మార్షల్స్ బయటకు తీసుకొచ్చారు. టిడిపి ఎంపీల నిరసనల గురించి చంద్రబాబునాయుడు ఆరా తీశారు.

టిడిపి ఎంపీలు అవంతి శ్రీనివాస్ సీతారామలక్ష్మి ఆరోగ్యం గురించి బాబు ఆరా తీశారు. కేంద్రం వైఖరి కారణంగానే ఎంపీలు అస్వస్థతకు గురయ్యారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని బాబు ప్రశంసించారు. ఎంపీల పోరాటంతో బాబు అభినందించారు.
కేంద్ర వైఖరిని రాష్ట్ర ప్రజల తరపున తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.బిజెపి నిరంకుశంగా వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేసుల మాఫీ కోసం వైసీపీ బిజెపితో కుమ్మకైందన్నారు.
ఏపీ రాష్ట్రంలో బిజెపికి ఏమీ లేదన్నారు. ఓ పార్టీ అండతోనే బిజెపి ఏపీకి అన్యాయం చేస్తోందని బాబు చెప్పారు. ఎంపీల పోరాటాన్ని చంద్రబాబునాయుడు అభినందించారు.












Click it and Unblock the Notifications