చింపేస్తే చిరిగిపోయేది కాదు టీడీపీ చరిత్ర.. మహానాడులో చంద్రబాబు కీలక ప్రసంగం..!
ఏపీలో అధికార టీడీపీ మహానాడు ఇవాళ కడపలో ప్రారంభమైంది. నవ్యాంధ్రలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగలో సీఎం చంద్రబాబు ఆరంభ ఉపన్యాసం చేశారు. ఇందులో ఆయన ఐదు దశాబ్దాల టీడీపీ చరిత్రను కార్యకర్తలకు, నాయకులకూ మరోసారి గుర్తుచేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి చేపట్టిన కార్యక్రమాలు, అవినీతిపై చేసిన పోరాటం, రాష్ట్రాభివృద్ధి కోసం చేపడుతున్న ప్రణాళికలు ఇలా ప్రతీ అంశాన్నీ చంద్రబాబు వివరించారు.
తొలిసారి దేవుని గడప అయిన కడపలో, అదీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలిసారి ఇక్కడ మహానాడు నిర్వహించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకూ 34 మహానాడులు జరుపుకున్నామని, రెండుసార్లు డిజిటల్ మహానాడులు కూడా జరుపుకున్నామని, అయితే కడపలో ఈసారి జరిగే మహానాడు ఓ చరిత్ర సృష్టించబోతుందని చంద్రబాబు తెలిపారు. ఇది ఆంద్రప్రదేశ్ కు దశ, దిశ చూపించబోతోందన్నారు.

రాయలసీమ ప్రజలు ఈసారి ఇచ్చిన అద్భుతమైన తీర్పుకు వారికి కృతజ్ఞతలు తెలపాలనే కడపలో మహానాడు పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు. ఈసారి 97 శాత స్ట్రైక్ రేట్, 50 శాతం ఓటింగ్ శాతంతో ఎన్నికల్లో చరిత్ర సృష్టించామన్నారు. కార్యకర్తల త్యాగాల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్డీయే ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ మహా విజయం సాధ్యమైందన్నారు. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ ఉన్నామన్నారు. నాలుగు దశాబ్దాల ప్రస్ధానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సంక్షోభాలు టీడీపీ ఎదుర్కుందని, పార్టీ పని అయిపోయిందన్న వాళ్ల పని అయిపోయిందన్నారు. టీడీపీ జెండా మాత్రం రెపరెపలాడుతుందన్నారు..
గతంలో తాను చేసిన మీ కోసం వస్తున్న పాదయాత్ర నుంచి గత ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకూ అదే స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, దీన్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలను వేేధించారని, వేటాడారని, అయినా ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాడారన్నారు. పసుపు సింహం చంద్రయ్య పీక కోస్తున్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు విడిచిపెట్టాడని ఇది ఒక్క ఉదాహరణ మాత్రమేనన్నారు. వీరి త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అన్నారు.
దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, కానీ ప్రజల జీవితాల్ని ఇంతగా ప్రభావితం చేసిన పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా 43 ఏళ్లుగా ప్రస్ధానం సాగిస్తున్నట్లు చంద్రబాబు గుర్తుచేశారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ప్రతీ దానికీ టీడీపీ ట్రెండ్ సెట్టర్ అని, టీడీపీయే బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు తెలిపారు. పటేల్ పట్వారీ వ్యవస్ధ నుంచి ఆడబిడ్డల ఆస్తిహక్కు వరకూ, ప్రత్యేక మహిళా వర్సిటీ వరకూ, రెండు రూపాయల కిలో బియ్యం నుంచి 4 వేల రూపాయల పింఛన్ వరకూ, దీపం పథకం నుంచి డ్వాక్రా సంఘాల సాధికారత వరకూ, నిరుద్యోగం నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ, రైతులకు డ్రిప్ సబ్సిడీ వరకూ, బడుగు బలహీనులకు అధికారం రుచి చూపిన పార్టీ టీడీపీ అన్నారు.
అడిగే పరిస్దితి నుంచి శాసించే పరిస్దితి తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. ఓ వర్గం, ప్రాంతం కాకుండా ఏ అంశమైనా పసుపు జెండా పుట్టకముందు, పుట్టిన తర్వాత అన్నట్లుగా పరిస్ధితి మార్చామన్నారు. రాజకీయ పాఠశాలలో మనమంతా నిత్య విద్యార్ధులమే అన్నారు. తాను కూడా నిత్య విద్యార్ధినే అన్నారు. తాను ఓ సైనికుడిని అని, నిరంతర పోరాటం చేస్తానన్నారు. మీరే నా ఆయుధాలన్నారు. ఆకాశమే హద్దుగా ఏ పనైనా చేస్తామన్నారు. సిద్దమా అని టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీకి నీతి నిజాయతీ రాజకీయాల బ్రాండ్ ఉందని, విజన్ తో పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రం ఫస్ట్ అనేది తమ సంకల్పం అన్నారు.
ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశామని, అధికాారంలో ఉండే అవినీత రహిత పాలన అందించామని,, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించామని, భావితరాల భవిష్యత్తు కోసం పాలసీలు తెచ్చామని, రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీ అన్నారు. ఏ పార్టీలో చూసినా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్దులే ఉన్నారంటూ అదీ టీడీపీ సత్తా అన్నారు. సామాజిక న్యాయం తాము తెచ్చిన అతిపెద్ద సామాజిక విప్లవం అన్నారు. 40 ఏళ్లకు ముందే బీసీల్ని రాజకీయాల్లో భాగస్వాముల్ని చేశామన్నారు. ఆ తర్వాతే దేశంలో అన్ని పార్టీలు బీసీల్ని గుర్తించాయన్నారు. సంస్ధాగతంగా బలమైన పార్టీ టీడీపీ అన్నారు. 45 రోజుల్లో కోటి సభ్యత్వాలు పూర్తి చేసిన పార్టీ టీడీపీ అన్నారు.
జాతీయ స్దాయిలో కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించదని, ఏపీ ఇవాళ ఆలోచించేది రేపు దేశం ఆలోచిస్తుందని అనేక సార్లు రుజువైందన్నారు. విద్యుత్ సంస్కరణలు, పీపీఏలు వంటివి దేశానికి పరిచయం చేశామన్నారు. పార్టీ విధానాల్లో నూతనత్వం తీసుకొద్దామన్నారు. టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications