సిట్ రిపోర్ట్ తో వైసీపీ అటాక్..! మంత్రులకు సీఎం కీలక సూచన..!

ఏపీలో గతేడాది తెరపైకి వచ్చిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ అయిందని చంద్రబాబుతో (chandrababu) పాటు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు, ఆ తర్వాత సనాతన ధర్మాన్ని కాపడతానంటూ పవన్ కళ్యాణ్ చేసిన హంగామాతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ చేరింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సిట్ బృందం.. తాజాగా రిపోర్ట్ ఇవ్వడంతో పాటు ఛార్జిషీట్ కూడా దాఖలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో సిట్ ఇచ్చిన రిపోర్ట్ పై సహజంగానే ఆసక్తి పెరిగింది. అయితే సిట్ నివేదికలో జంతువుల కొవ్వులు కలిసినట్లు నేరుగా ఎక్కడా పేర్కొనకపోవడంతో విపక్ష వైసీపీకి ఇదో అస్త్రంగా మారింది. గతంలో తాము జంతువుల కొవ్వులు కలిపినట్లు చంద్రబాబు, కూటమి నేతలు చేసిన ఆరోపణల్ని, వీటిని ఆధారంగా చేసుకుని పవన్ చేసిన హంగామాను ఇప్పుడు వైసీపీ టార్గెట్ చేస్తోంది.

Chandrababu s Key Advice to Ministers on Facing YSRCP s Ghee Adulteration attack with SIT report

ఈ నేపథ్యంలో ఇవాళ అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలోనూ (ap cabinet meeting) కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్ అంశాన్ని మంత్రులు సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. కల్తీ నెయ్యి కేసులో వైసీపీ చేస్తున్న విమర్శల్ని ఎలా కౌంటర్ చేయాలనే అంశంపై సీఎం సూచనలు కోరారు. అలాగే అధికారికంగా సిట్ నివేదికను తెప్పించాలని కూడా సీఎంను వారు కోరారు. దీంతో చంద్రబాబు వారికి కీలక సలహా ఇచ్చారు. మంత్రులు కోరిన విధంగా సిట్ నివేదిక తెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ నివేదిక వచ్చాకే అధికారికంగా స్పందించాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. తద్వారా అధికారికంగా వెలువడని నివేదికపై ఇప్పుడు స్పందించి ఉపయోగం లేదని సీఎం తేల్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+