Chandrababu: తెలుగుదేశం సీనియర్ల‌పై చంద్ర‌బాబు కొర‌డా?

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల్లో ఇప్పుడు గుబులు రేకెత్తుతోంది. చంద్ర‌బాబునాయుడి ద‌గ్గ‌ర ఉన్న మెత‌క‌త‌నాన్ని ఆస‌ర‌గా తీసుకొన్ని ఇన్ని సంవ‌త్స‌రాలు ఇష్టారాజ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారం చెలాయించి సీనియ‌ర్లుగా చెలామ‌ణి అయిన‌వారంద‌రినీ ఇప్పుడు ప‌క్క‌న పెడుతుండ‌ట‌మే దీనికి కార‌ణం. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు జిల్లాల‌వారీగా ప‌ర్య‌టిస్తున్నారు. బాదుడే బాదుడు పేరుతో జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో పార్టీలో కొన్ని ద‌శాబ్దాల నుంచి ఉన్న నేత‌లు కూడా పాల్గొన‌డంలేదు. అంతేకాకుండా ఈ ప‌ర్య‌ట‌న‌కు అయ్యే ఖ‌ర్చును కూడా కొంత‌మేర‌కు భ‌రించ‌డానికి ముందుకు రాలేద‌ని తెలుగుదేశం పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 మొహ‌మాటాన్ని వ‌దిలించుకుంటున్న చంద్ర‌బాబు

మొహ‌మాటాన్ని వ‌దిలించుకుంటున్న చంద్ర‌బాబు


దీంతో ఇన్నిసంవ‌త్స‌రాలుగా త‌న‌కున్న మొహ‌మాటాన్ని చంద్ర‌బాబు వ‌దిలించుకుంటున్నారు. రాబోయే ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మార‌డంతో క‌టువైన నిర్ణ‌యాలు త‌ప్ప‌ద‌ని ఆయ‌న ఇప్ప‌టికే హెచ్చ‌రించారు. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40 సీట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు సీట్లు పొందిన‌వారికి నాయ‌క‌త్వ మెళ‌కువ‌లు నేర్పించి భ‌విష్య‌త్తు నేత‌లుగా తీర్చిదిద్దుతామ‌ని హామీ ఇచ్చారు.

 డోన్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు

డోన్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు

చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు చూపిస్తున్నారు. ఇక్క‌డ కొన్ని ద‌శాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలో కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుల‌దే హ‌వా. ఎన్నిక‌లు వ‌స్తున్నాయి అంటే వారి కుటుంబం నుంచే ఒక‌రికి సీటు ఖాయ‌మ‌న్న‌ట్లుగా ప‌రిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితిని బాబు స‌మూలంగా మార్చేశారు. ధ‌ర్మ‌వ‌రం సుబ్బారెడ్డికి రాబోయే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించేశారు. ప‌నిచేసుకోవాల‌ని సూచించారు. దీంతో కేఈ సోద‌రులు ఖంగు తిన్నారు.

 పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే ఒక‌రూ ముందుకు రావ‌డంలేదు

పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే ఒక‌రూ ముందుకు రావ‌డంలేదు

పార్టీ ప‌ద‌వుల‌తోపాటు ప్ర‌భుత్వ ప‌ద‌వులు కూడా పొంది పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న ఆర్థికంగా ఆదుకోవ‌డానికి చాలామంది సీనియ‌ర్ నేత‌లు ముందుకు రావ‌డంలేదు. ఇటువంటివారంద‌రినీ త‌ప్పించాలంటూ తెలుగుదేశం పార్టీలోని యువ నాయ‌క‌త్వం గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ నాయ‌క‌త్వం తెర‌పైకి వ‌స్తోంది. ఒక్క డోన్ నియోజ‌క‌వ‌ర్గ‌మ‌నే కాకుండా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ల‌ను మార్చ‌బోతున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా చంద్ర‌బాబు ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు వెళుతున్నారు. ఈసారి ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందుగానే అభ్య‌ర్థులంద‌రినీ ప్ర‌క‌టించ‌బోతున్న పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+