చంద్రభానుకి ఉరేయండి: లాయర్, వదిలేయమని బతిమాలిన అనూహ్య
ముంబై: మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ అత్యాచారం, హత్యకు గురైన బందర్ టెక్కీ అనూహ్య కేసులో దోషిగా తేలిన చంద్రభాన్ సుదమ్ సనప్‌కు శిక్షను ముంబై కోర్టు ఎల్లుండి (30వ తేదీన) ఖరారు చేయనుంది. నేడు శిక్ష ఖరారు కావాల్సి ఉంది. అయితే శిక్ష ఖరారును కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
అనూహ్య పైన అత్యాచారం, హత్య కేసులో ట్యాక్సీ డ్రైవర్ చంద్రభానును ముంబై కోర్టు మంగళవారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. చంద్రభానుకు ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుధవారం వాదించారు. అనంతరం న్యాయమూర్తి వాయిదా వేశారు.
కాగా, అనూహ్య హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సనప్ (28)ను ముంబై మహిళా ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధరించింది. సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 302(హత్య), సెక్షన్ 397 (దోపిడీ, హత్య) కింద అతని నేరం రుజువైంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య ముంబైలోని అంధేరి పరిసరాల్లో ఉన్న టిసిఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేది. 2013 డిసెంబరులో క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం వెళ్లింది. సెలవుల అనంతరం 2014, జనవరి 4న విజయవాడలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబైకి తిరుగు ప్రయాణమయింది.
కుమార్తెను రైలు ఎక్కించిన తండ్రి సురేంద్రప్రసాద్ ఆ రోజు అర్ధరాత్రి అనూహ్యతో మాట్లాడారు. ఆ సమయంలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ లేదని ముంబై చేరుకున్న తర్వాత ఫోను చేస్తానని చెప్పింది. అనంతరం అనూహ్య నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
నిర్మానుష్యంగా ఉండే కంజూర్‌మార్గ్, బాండూప్ ప్రాంతంలో జనవరి 16న సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. సమీపంలో దొరికిన ఆనవాళ్లను బట్టి ఆ మృతదేహం అనూహ్యదిగా నిర్ధరించారు.
జనవరి 5 ఉదయం 4 గంటల ప్రాంతంలో చంద్రభాన్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో లోక్‌మాన్య తిలక్ టర్మీనస్ (ఎల్‌టీటీ) రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ అనూహ్యను గమనించాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా చెప్పి, రూ.300కే అంధేరిలోని హాస్టల్ గది వద్ద విడిచిపెడతానని నమ్మించాడు.
ట్యాక్సీలో కాకుండా బలవంతంగా బెదిరించి మోటార్ సైకిల్ పైన ఎక్కించుకున్నాడు. కంజూర్‌మార్గ్ మీదుగా తాను నివాసం ఉంటున్న కార్వే నగర్‌కు రెండు కి.మీ దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘోరానికి ఒడిగట్టాడు.
విడిచిపెట్టాలని బతిమాలిన అనూహ్య
ప్రాణాలతో విడిచిపెట్టాలని, అందుకు రూ.రెండు లక్షలు ఇస్తానని అనూహ్య ప్రాధేయపడినప్పటికీ చంద్రభాన్ మనసు కరగలేదు. ఈ విషయాన్ని అతనే పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత అనూహ్య ఎదురు తిరగడంతో తొలుత చెంపదెబ్బ కొట్టాడు.
దీంతో ఆమె తన వద్ద అప్పటికి ఉన్న నగదు మొత్తం ఇచ్చేస్తానని, విడిచి పెట్టాలని కోరింది. ఆ తర్వాత రూ.ఒకటి, రెండు లక్షలు సర్దుబాటు చేస్తానంది. అయినా కనికరం చూపని చంద్రభాన్.. అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి చంపేశాడు.
అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనూహ్యను ఎక్కించుకుని తీసుకెళ్లిన మోటారు సైకిల్ చంద్రభాన్ స్నేహితుడు చంద్రశేఖర్ సాహుది. అత్యాచారం, హత్య గురించి అతనికి చంద్రభాన్ చెప్పేశాడు. అనూహ్య దుస్తులు, కళ్లద్దాలు, హ్యాండ్ బ్యాగ్‌ను చంద్రభాన్ తన చెల్లెలి వద్ద ఉంచి అక్కడ్నుంచి నాసిక్‌కు పారిపోయాడు.
క్రైం బ్రాంచ్ పోలీసులు ఎల్‌టీటీ రైల్వేస్టేషన్, ఆయా పరిసరాల్లో ఉన్న 36 సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించారు. తొమ్మిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. కార్వేలో నివాసముంటున్న తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చిన చంద్రభాన్‌ను రెండు నెలల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications