Chandrayaan-3: విజయవంతంగా 5వ కక్ష్యలోకి, చివరి దశకు అడుగు దూరంలో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ప్రయోగం చంద్రయాన్-3 విజయం దిశగా సాగుతోంది. చంద్రయాన్-3 వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మంగళవారం మరో ముందడుగు వేసింది. ఇప్పటి వరకు నాలుగో కక్ష్యలో భూమి చుట్టూ తిరిగిన ఈ వ్యోమనౌకకు సంబంధించిన ఐదో కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది.
బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ISTRAC) నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీంతో చంద్రయాన్ ఇప్పుడు 127609 కిలోమీటర్లు X 236 కి.మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో వెల్లడించింది. కాగా, భూమి చుట్టూ తిరిగే విషయంలో చంద్రయాన్-3 కి సంబంధించి ఇది చివరి కక్ష్య కావడం గమనార్హం. దీని తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

Chandrayaan-3 Mission:
— ISRO (@isro) July 25, 2023
The orbit-raising maneuver (Earth-bound perigee firing) is performed successfully from ISTRAC/ISRO, Bengaluru.
The spacecraft is expected to attain an orbit of 127609 km x 236 km. The achieved orbit will be confirmed after the observations.
The next… pic.twitter.com/LYb4XBMaU3
ఇప్పటి వరకు దశలవారీగా ఐదు సార్లు కక్ష్యలను పెంచి.. చంద్రయాన్-3ని చంద్రుడికి దగ్గర చేస్తున్నారు. ఐదో భూకక్ష్య పూర్తయిన తర్వాత ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. ఇక అంతా సాజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండర్ అడుగుపెడుతుంది. దీంతో ప్రయోగం విజయవంతమైనట్లవుతుంది.












Click it and Unblock the Notifications