కడప జడ్పీ సమావేశంలో రసాభాస: మైకులు విసురుకున్న వైసిపి, టిడిపి నేతలు
కడప: నగరంలో శనివారం నిర్వహించిన జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రంగా వాగ్వాదం చేసుకున్నారు. అనంతరం మైకులు విసురేశారు.
ప్రోటోకాల్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు దూషించడంతో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు మైకులు విసిరేసుకున్నారు.

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వైయస్సార్ కాంగ్రె ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల తీరును టీడీపీ తప్పుబట్టింది.
ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ సభ్యుల తీరుకు నిరసనగా కలెక్టర్ జీవీరమణ, అధికారులు సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications