ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం, చెప్పుల దండ వేసిన దుండగులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి అవమానం జరిగింది.
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఆయన విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు.

మంగళవారం ఉదయం దీనిని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ర్యాలీ నిర్వహించారు.
జన్మభూమి సభను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. టిడిపి జిల్లా నేతలు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.












Click it and Unblock the Notifications