జెమిని గ్రూప్ సంస్థ ఎఫెక్ట్: నెల్లూరు మేయర్‌కు షాక్, చెన్నైలో చీటింగ్ కేసు, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు/చెన్నై: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు మేయర్ ఎస్కే అబ్దుల్ అజిజ్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. అతనిపై తమిళనాడులోని చెన్నైలో కేసు నమోదయినట్లుగా ఆలస్యంగా వెలుగు చూసిందని వార్తలు వస్తున్నాయి.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అతనిపై 406, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు డిసెంబర్ 1వ తేదీన పెట్టారని తెలుస్తోంది. వివరాల మేరకు జెమినీ గ్రూప్‌కు చెందిన ఆనంద్ సినీ సర్వీసెస్ వింగ్ ప్రసాద్ జింపెక్స్ ఈ ఫిర్యాదు చేసింది.

 ఆలస్యంగా వెలుగుచూసిన కేసు

ఆలస్యంగా వెలుగుచూసిన కేసు

మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఆయన సోదరుడు జలీల్‌, కుటుంబ సభ్యులపై చెన్నై సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బిజినెస్‌లో భాగంగా స్టార్‌ ఆగ్రోస్‌ నిర్వాహకులు మోసానికి పాల్పడినట్లు ప్రసాద్‌ జంపెక్స్‌ తరఫున మనోహర్ ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.

స్టార్ ఆగ్రోస్ మెరైన్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్

స్టార్ ఆగ్రోస్ మెరైన్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్

స్టార్‌ ఆగ్రోస్‌ మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ప్రయివేట్ లిమిటెడ్‌లో అబ్దుల్‌ జలీల్‌, షేక్‌ అబ్దుల్‌ ఖుద్దూస్‌, స్టార్‌ ఆర్గానిక్‌ ఫుడ్స్‌కు చెందిన షేక్‌ ఫౌజియా భాను, షేక్‌ షర్మిల, అనిల్‌ కుమార్‌ కోనేరు, షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ల పేర్లను ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు.

స్టార్‌ ఆగ్రోస్‌లో వాటా కొనుగోలుకు రూ.42 కోట్ల మొత్తం ఇచ్చినట్లు, దాన్ని వారు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు క్రైం బ్రాంచిలో గత డిసెంబర్ నెలలో కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది.

రూ.42 కోట్లు చెల్లించింది

రూ.42 కోట్లు చెల్లించింది

వివరాల మేరకు.. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ కుటుంబానికి స్టార్‌ ఆగ్రోస్‌ పేరిట నెల్లూరులో రొయ్యల శుద్ధి కర్మాగారం ఉంది. దీని నుంచి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. సంస్థకు అమెరికా, లండన్‌లలో శాఖలున్నాయి. ఇందులో వాటా విక్రయం పేరుతో చెన్నైకు చెందిన ప్రసాద్‌ జంపెక్స్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంస్థలో 80 శాతం వాటా ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రూ.36కోట్లను బ్యాంకు ద్వారా తర్వాత మరో రూ.6కోట్ల మొత్తాన్ని జంపెక్స్‌ సంస్థ చెల్లించింది.

 ఆరుగురిపై కేసు నమోదు

ఆరుగురిపై కేసు నమోదు

ఇందులో అనిల్ కుమార్‌ మధ్యవర్తిత్వం వహంచారు. లావాదేవాలపై అనుమానం వచ్చి లండన్‌, అమెరికాల్లో ఉన్న శాఖలకు వెళ్లి విచారిస్తే అలాంటివేమీ సాగడం లేదని తేలింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన జంపెక్స్‌ సంస్థ పోలీసులను ఆశ్రయించగా వారు నిందితులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. కాగా, తనకు స్టార్ ఆగ్రోస్ సంస్థతో సంబంధం లేదని, గతంలోనే బయటకు వచ్చానని మేయర్ అజీచ్ వివరణ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nellore Mayor Sk Abdul Aziz has landed in trouble with a cheating case booked against his firm in Chennai. The Central Crime Branch (CCB) booked the case under Sections 406, 420, and 506 read with IPC 120-B on December 1.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి