వైఎస్ భారతిని తిట్టిన చేబ్రోలు కిరణ్ కు రిమాండ్- అక్కడే జడ్జి బిగ్ ట్విస్ట్..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఐటీడీపీ మాజీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను పోలీసులు ఇవాళ మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో నిన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

వైఎస్ భారతిపై యూట్యూబ్ ఛానల్లో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో చేబ్రోలు కిరణ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. అయితే ఈ కేసు వాదనల సందర్భంగా పోలీసుల తీరుపై మంగళగిరి కోర్టు జడ్జి అసహనం వ్యక్తం చేశారు. జగన్‌ సతీమణిని దూషించిన కేసులో కిరణ్‌పై కేసు నమోదు చేయడం వరకూ బాగానే ఉన్నా..చేబ్రోలు కిరణ్‌పై 111 సెక్షన్ పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.

chebrolu kiran kumar sent to remand in ys Bharati remarks case judge ordered memo to police

చేబ్రోలు కిరణ్ పై సీఆర్పీసీలోని సెక్షన్ 111 పెట్టిన మంగళగిరి గ్రామీణ సీఐపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో మంగళగిరి సీఐ శ్రీనివాసరావుకు ఛార్జ్‌మెమో ఇవ్వాలని గుంటూరు ఎస్పీకి జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సెక్షన్ పెట్టడంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎస్పీకి జడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఇరుకునపడ్డారు. వాస్తవానికి నిన్న పోసాని కృష్ణమురళి వ్యవహారంలో హైకోర్టు ఇదే సెక్షన్ 111పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+