Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై పేలుళ్లు: తనిఖీలు, ఆంధ్ర లక్ష్యమా? (పిక్చర్స్)

హైదరాబాద్: చెన్నై రైల్వే స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుళ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు హైదరాబాద్‌లో కూడా దాడులు చేసే అవకాశం ఉందన్న కేంద్ర హోం శాఖ హెచ్చరికలతో రాష్టవ్య్రాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురువారం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతోపాటు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ఉగ్రవాదుల లక్ష్యం తమిళనాడు కాకపోవచ్చని, రైలు ఆలస్యం వల్లే తమిళనాడులో పేలుళ్లు సంభవించి ఉంటాయని ఆ రాష్ట్ర డిజిపి రామానుజం అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే ఉగ్రవాదులు బాంబులు అమర్చి ఉంటారని రాష్ట్ర పోలీసులు శాఖ భావిస్తోంది.

రైల్వే పోలీసుల తనిఖీల్లో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో పది నాటు బాంబులు బయటపడడం, నెల్లూరు రైల్వే స్టేషన్‌లో అనునాస్పద స్థితిలో ఓ సూట్‌కేసు కనిపించడం కలకలం రేపాయి.

రైల్వే స్టేషన్లలో తనిఖీలు

రైల్వే స్టేషన్లలో తనిఖీలు

సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీలు, ప్లాట్ ఫాంలతోపాటు స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనూ తనిఖీలు జరిపారు.

రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

రైల్వే స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. స్టేషన్‌లోకి ప్రవేశించే మార్గాల్లో మెటల్ డిటెక్టర్లను పటిష్టం చేశామన్నారు.

లగేజీ తనిఖీలు

లగేజీ తనిఖీలు

హైదరాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, ప్రయాణికులను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నామని వివరించారు.

అన్ని రైల్వే స్టేషన్లలో...

అన్ని రైల్వే స్టేషన్లలో...

హైదరాబాద్ రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో కూడా రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

జాగిలాలతో తనిఖీలు..

జాగిలాలతో తనిఖీలు..

ముఖ్యంగా జిఆర్‌పి పోలీసులు నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో బాంబు స్క్వాడ్, జాగీలాలతో తనిఖీలు నిర్వహించారు.

ఇలా తనిఖీలు...

ఇలా తనిఖీలు...

తిరుపతి, ఖాజీపేట, విజయవాడ, గుంటూరు, నెల్లూరు తదితర పట్టణాల్లోని రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్ దృశ్యం ఇది..

హైదరాబాద్‌లో నాకాబందీ

హైదరాబాద్‌లో నాకాబందీ

హైదరాబాద్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు, షాపింగ్ మాల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై నాకాబందీ ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

నిఘా వర్గాల హెచ్చరిక

నిఘా వర్గాల హెచ్చరిక

నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు.

రైలు ఆలస్యం కావడం వల్లే..

రైలు ఆలస్యం కావడం వల్లే..

రైలు ఆలస్యం కావడం వల్లనే చెన్నైలో బాంబులు పేలి ఉంటాయని, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేలి ఉండేవని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌కూ ముప్పు హెచ్చరిక

హైదరాబాద్‌కూ ముప్పు హెచ్చరిక

హైదరాబాద్‌లో కూడా పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+