ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా భర్త, ప్రముఖ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై తమిళనాడులోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన సెల్వమణి ఏ మాత్రం స్పందించలేదు. అంతేగాక, ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు సమాధానం ఇవ్వకపోవడం ఆగ్రహానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఈ విషయంలో మంత్రి రోజా ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. కేసు వేసిన ముకుంద్ చంద్ బోత్రా అనే వ్యక్తి మృతి చెందగా.. అతడి కుమారుడు గగన్ బోత్రా కేసును కొనసాగిస్తున్నారు.

పరువ నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో డైరెక్టర్ ఆర్కే సెల్వమణిపై చెన్నై జార్జ్ టౌన్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి, నటి రోజా భర్త సెల్వమణి పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. 2016లో ఓ కేసులో ముకుంద్ చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ అరెస్ట్ కాగా.. ముకుంద్ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో సెల్వమణి చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని ముకుంద్ కేసు దాఖలు చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ముకుంద్ చంద్ బోత్రా చనిపోయారు. అయితే, ముకుంద్ కుమారుడైన గగన్ బోత్రా కేసును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ సోమవారం జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బోద్రా.. సెల్వమణితోపాటు అరుళ్ అనే మరో వ్యక్తిపైనా పరువు నష్టం దావా వేశారు.
అయితే, ఇది నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కాగా.. సెల్వమణి ఇప్పుడు అరెస్టు వారెంట్ నుంచి తప్పించుకోవాలంటే.. కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications