వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు రూ.25 లక్షలు: భన్వర్ లాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chief Electoral Officer Bhanwar Lal Press Meet
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ పోలింగ్ వివరాలను బుధవారం వివరించారు. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చునని చెప్పారు. అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు సహా అన్నింటిని పొందుపర్చాలని చెప్పారు.

ఎన్నికల ఖర్చును అన్ని పార్టీలు విధిగా ఎన్నికల కమిషన్‌కు చూపించాలన్నారు. ఓటరుగా నమోదు చేసుకొని వారికి ఈ నెల 9వ తేదీ చివరి అవకాశమని చెప్పారు. ఆ లోగా అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు స్లిప్‌లో అన్ని వివరాలను పొందుపరుస్తామని చెప్పారు.

ఎస్సెమ్మెస్, వెబ్ సైట్ ద్వారా ఓటరు పేరు ఉందా లేదా సరిచూసుకోవాలని తెలిపారు. కొత్తగా నమోదు చేసుకున్న 76 లక్షల మంది ఓటర్లకు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. కొత్త ఓటర్లకు కలర్ కార్డులు ఉండనున్నాయి. పాత ఓటర్లు కూడా ఈ సేవా కేంద్రాల్లో స్మార్ట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు.

పోలింగ్‌కు రెండు రోజుల ముందే ప్రతి ఇంటికి వెళ్లి స్లిప్పులు ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అత్యాధునిక ఈవిఎంలను ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈవిఎంలలో తొలిసారి నోటా బటన్ పొందుపర్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భద్రత కోసం 457 కంపెనీల బలగాలను కావాలని కోరామన్నారు. అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెంబర్లు.. 040 - 2345 9364, 2345 0360, 2345 0343 టోల్ ఫ్రీ నంబర్.. 1950.

English summary
State election commissioner Bhanwar Lal press meet on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X