విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు శాఖలు ఎందుకు అమరావతికి వెళ్ళడం లేదంటే?

అమరావతి నుండే ఆంద్రప్రదేశ్ పాలన సాగుతున్న కార్మికశాఖ కు చెందిన రెండు బోర్డులు మాత్రం హైద్రాబాద్ నుండే పనులు చేస్తున్నారు. ఈ శాఖలు విజయవాడకు తరలకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి : అమరావతి కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా సాగుతోన్నా రెండుశాఖలు మాత్రం అమరావతికి వెళ్ళేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి.అయితే ఈ శాఖలపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.ఈ మేరకు సంబందిత ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు చేరింది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పాలన అంతా అమరావతి నుండి ప్రారంభమైంది.అయితే సెక్రటేరియట్ తో అన్ని శాఖలు అమరావతికి చేరాయి.కాని, కార్మికశాఖలోని రెండు బోర్డులు మాత్రం అమరావతికి వచ్చేందుకు అంగీకరించడం లేదు.

హైద్రాబాద్ నుండి కదలకుండా కార్మికశాఖలోని రెండు బోర్డులు మొండికేస్తున్నాయి.కార్మిక సంక్షేమ బోర్డు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు హైద్రాబాద్ నుండి కదలడం లేదు.

కార్మికశాఖ కమీషనర్ ఆదేశాలను కూడ ఈ రెండు బోర్డులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ శాఖలపై చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమీషనర్ ముఖ్యమంత్రిని కోరారు.

హైద్రాబాద్ ను ఎందుకు వదలడం లేదంటే?

హైద్రాబాద్ ను ఎందుకు వదలడం లేదంటే?

రాష్ట్ర లేబర్ కమీషనరేట్ హైద్రాబాద్ నుండి విజయవాడకు తరలివెళ్ళింది.విజయవాడలోని పుష్పహోటల్ సెంటర్ లో ఐదంతస్తుల ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకొని అన్ని ఒకేచోట ఉండేలా రూ.90 లక్షలను ఖర్చు చేసి అన్ని సౌకర్యాలను కల్పించారు.ప్రతి నెల నాలుగు లక్షలను అద్దె రూపంలో చెల్లిస్తున్నారు.అయితే కార్మికశాఖ, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులు రెండు హైద్రాబాద్ లోని ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ఉన్నాయి.ఈ రెండు శాఖలు ఎపి పునర్విభజన చట్టం పదో షెడ్యూల్ లో ఉన్నందున హైద్రాబాద్ ను విడిచి వెళ్ళడం సరైందికాదని అధికారులు చెబుతున్నారు.

అసలు కారణమేమిటంటే?

అసలు కారణమేమిటంటే?

విజయవాడకు చెందిన ఓ అధికారి ఆ రెండింటిలో ఓ బోర్డుకు భాద్యుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను తెలంగాణ కేడర్ కు ప్రభుత్వం కేటాయించింది. అయితే ఎపిలో ఉంటే మరో రెండేళ్ళ సర్వీసు కలిసివస్తోందని ఆయన భావించాడు.అయితే ఆయన తెలంగాణ నుండి ఎపికి మారాడు. 57 ఏళ్ళ వయస్సులో ఆయన ఎపికి మారాడు.అంతవరకు బాగానే ఉన్నా స్వంత ఊరుకురాకుండా హైద్రాబాద్ లో ఉండడానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు.త్వరలోనే రిటైర్ కాబోతున్నందున ఆయన మరికొన్నిరోజుల పాటు గడిపేందుకుగాను ఈ రకంగా వ్యవహరించారని కార్మికశాఖ అధికారులు నిర్వహించిన విచారణలో తేలింది.

నిధుల గోల్ మాల్ వ్యవహరం కూడ కారణమేనా?

నిధుల గోల్ మాల్ వ్యవహరం కూడ కారణమేనా?

కార్మికశాఖలోని మరో బోర్డుకు అధికారిగా ఉన్న వ్యక్తి ఏడు కోట్లు ఖర్చు చేసిన వ్యవహరం కూడ అమరావతికి మారకపోవడానికి కారణంగా మారిందని కార్మికశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా కోట్లు ఖర్చు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చిన్న సమాచారం కోసం కోట్లాది రూపాయాలను ఖర్చు చేయడం కూడ ఆయనకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది.దీంతో ఆయన అమరావతికి మారేందుకు ఆసక్తిని చూపడంలేదని తెలుస్తోంది.

నిబంధనలు ఉల్లంఘించడం కూడ కారణమేనా?

నిబంధనలు ఉల్లంఘించడం కూడ కారణమేనా?

ఈ రెండు బోర్డుల్లోని ఓ అధికారి నిబంధనలకు విరుద్దంగా ఓ యువతి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు శాఖలకు చెందిన అధికారులపై కార్మికశాఖ ఉన్నతాధికారుల నిఘా ఉంది.దీంతో వీరిద్దరూ కూడ అమరావతికి వెళ్ళేందుకు ఆసక్తిని చూపడం లేదు.తమ స్వంత లాభంకోసం కార్మికులనుఇబ్బందులకు గురిచేస్తున్నారని వారిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహరంపై కార్మిక శాఖ ఉన్నతాధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. సిఎం నిర్ణయం తీసుకొంటే వీరిపై చర్యలు తప్పవు.

English summary
chief minister chandrababu will take action against labour department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X