జగన్ ట్రాప్ లో చిక్కుకున్న చంద్రబాబు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ట్రాప్ లో పూర్తిగా చిక్కుకున్నారని సీనియర్ రాజకీయవేత్తలు, పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక అంశంపై నిరసనలు, పోరాటాన్ని ప్రారంభించిన టీడీపీ దాన్ని అర్థంతరంగా వదిలేసి మరో అంశంపై పోరాడేందుకు వెళుతోందని, రాజకీయంగా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారమయ్యేవరకు పోరాటం చేయలేకపోతోందని భావిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశాన్ని చూపిస్తున్నారు.

 కనుమరుగైన ఎన్టీఆర్ పేరు మార్పు అంశం

కనుమరుగైన ఎన్టీఆర్ పేరు మార్పు అంశం


ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశంపై పోరాటం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ దాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లింది. చంద్రబాబునాయుడు స్వయంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉధృతంగా పోరాటం జరుగుతున్న సమయంలో మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. ఎన్టీఆర్ పేరు మార్పు అంశం సహజంగానే కనుమరుగైపోయింది. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమించడానికి అన్ని జిల్లాలకు చెందిన పార్టీ యంత్రాంగం కార్యాచరణను కూడా రూపొందించింది. కానీ తన పోరాటాన్ని తర్వాత అంశాలవైపు మళ్లించింది.

దసపల్లాపై హోరాహోరీ పోరు

దసపల్లాపై హోరాహోరీ పోరు


''మూడు రాజధానులు కాదు.. అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగీకరించి ఇప్పుడు మాట మారుస్తున్నారంటూ'' చంద్రబాబు జగన్ పై మండిపడ్డారు. దీనిపై పోరాటం జరుగుతున్న క్రమంలోనే తెలుగు తమ్ముళ్లు దీన్ని వదిలేసి అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టిపెట్టారు. అమరావతివల్ల నష్టాల గురించి అధికార ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, టీడీపీ శ్రేణులు అమరావతివల్ల కలిగే లాభాలను, ఉత్తరాంధ్రలో వైసీపీ ఆగడాలను ప్రజలకు వివరించడం మొదలుపెట్టారు. దసపల్లా భూములపై ఇరుపార్టీలు కొద్దిరోజులు హోరాహోరీగా తలపడ్డాయి.

వైసీపీ విశాఖ గర్జన

వైసీపీ విశాఖ గర్జన


ఇదిలా ఉండగానే విశాఖపట్నంలో వైసీపీ 'విశాఖ గర్జన' పేరుతో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించింది. దీంతో దృష్టి మొత్తం అటువైపుకు మళ్లింది. ఒక అంశం తర్వాత మరో అంశం తెరమీదకు వస్తుండటంతో వాటివెనకాల తెలుగు తమ్ముళ్లు పరుగులు తీస్తున్నారు. ఇతర అంశాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. ఒక ప్రధానమైన సమస్యను లైవ్ లోనే ఉంచడానికి ఆ పార్టీ దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేయడంలేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకుపోయారని, ఇప్పటికైనా కళ్లు తెరవాలంటూ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+