ఎపిలో చైనా సోలార్ పార్కు...ఇదే మొదటిది:ఇక్కడే ఎందుకంటే
చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీ సిటీలో ఒక చైనా కంపెనీ సోలార్ పార్కు ఏర్పాటు చేస్తోంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ సంస్థ (సీఈటీసీ) రూ.320 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పార్కుకు గురువారం భూమి పూజ చేసింది.
గురువారం శ్రీసిటీలో నిర్వహించిన ఈ భూమిపూజలో సీఈటీసీ సీఈవో, జనరల్ మేనేజర్ ల్యూయి లెహంగ్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ సీఈవో, రాష్ట్రప్రభుత్వ కార్యదర్శి జె.కృష్ణకిశోర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. ఎపి ప్రభుత్వం అందిస్తున్న సహకారం, శ్రీసిటీలోని సదుపాయాలను చూసిన తాము సంస్థ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు సీఈటీసీ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు. దీని ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

చైనా కంపెని:పెట్టుబడి...ఉద్యోగాలు...
ఈ సందర్భంగా సిఇటిసి ఇఇఒ ల్యూయిలెహంగ్ మాట్లాడుతూ...."రూ.320 కోట్ల పెట్టుబడితో 18 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ కోసం ఈ పార్కు నిర్మాణం చేపడుతున్నాం. 18 నెలల్లో పార్కు ఏర్పాటు పూర్తి చేస్తాం. దీని ద్వారా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి"...అని చెప్పారు. 18 నుంచి 20 నెలల్లోపు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

ఎపి లోనే...ఎందుకంటే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, శ్రీసిటీలోని సదుపాయాలను చూసిన తాము సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు సిఇటిసి ఇఇఒ ల్యూయిలెహంగ్ చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటు చేసేందుకు దేశంలోని పలు పారిశ్రామిక నగరాలను పరిశీలించామన్నారు. ఎక్కడలేని లేని సదుపాయాలు శ్రీసిటీలో ఉన్నందునే తాము పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్‌లో మరికొన్ని ఎలక్ట్రానిక్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. ఎపి ముఖ్యమంత్రి చైనా పర్యటనల ద్వారానే పరిశ్రమలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఎపిలో...ఇదే మొదటి చైనా కంపెని
అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ చైనాకు సంబందించి రాష్ట్రానికి వచ్చిన మొదటి భారీ కంపెనీ సిఇటిసి అని తెలిపారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సీఈటీసీతో సహా పలు చైనా సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇది చైనా ప్రభుత్వానికి చెందిన పరిశ్రమ కావడంతో భవిష్యతులో మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సంస్థ రాక...సోలార్ కు ప్రోత్సాహం
దేశంలో సోలార్ విద్యుత్ తయారీకి సీఈటీసీ రాక మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. డీటిజెడ్‌లో 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.320 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకుంటే ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications