సత్యానంద్ బెయిల్‌తో సంబంధం లేదు, శిక్ష తప్పదు: హోంమంత్రి చినరాజప్ప
గుంటూరు: కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాల్ మనీ కేసులో నిందితుడిగా ఉన్న సత్యానంద్ బెయిల్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని మంత్రి రాజప్ప చెప్పారు. సెక్స్ రాకెట్ వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో నిందితుడిగా ఉన్న సత్యానంద్‌కు మంగళవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

ఏపీలో 12మంది ఐపీఎస్‌లు బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో 12మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. విజయరావు, రాహుల్‌దేవ్ శర్మ, విశాల్‌లను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, రంపచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి, సీఐడీ ఏఎస్పీగా ఎన్.శ్వేత, కడప అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బి.సత్య ఏసుబాబు, విజయనగరం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా సీహెచ్. వెంకట అప్పలనాయుడు, పాడేరు ఏఎస్పీగా శశికుమార్, గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా కె.ఫకీరప్ప, నర్సీపట్నం అదనపు ఎస్పీ(ఆపరేషన్స్)గా బాబూజీ , చిత్తూరు పరిపాలన అదనపు ఎస్పీగా అభిషేక్ మొహంతి బదిలీ చేసింది.












Click it and Unblock the Notifications