ముద్రగడ పెద్ద నాయకుడేమీ కాదు: చినరాజప్ప, రావెల సుశీల్‌పైనా స్పందన
హైదరాబాద్: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం తమకేమీ లేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. ముద్రగడ పెద్ద నాయకుడేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాంతిభద్రతలపై ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తుని ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే చిత్తశుద్ధి తమ నేత చంద్రబాబుకు ఉందని ఆయన స్పష్టం చేశారు. తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేసిందని ముద్రగడ పద్మనాభం ఆరోపించిన విషయం తెలిసిందే.

ముద్రగడ దీక్షను తమ ప్రభుత్వం పట్టించుకోదని చినరాజప్ప చెప్పారు. పార్టీ మారిన శానససభ్యులపై స్పీకర్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.
రావెల కుమారుడి వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు చూసుకుంటారని మంత్రి చినరాజప్ప వివరించారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కాదని అన్నారు. తప్పు ఎవరు చేసిన తప్పించుకోలేరని ఆయన అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications