చినజీయరుస్వామి ఆశ్రమంలో ఏం జరుగుతోంది?

చినజీయరుస్వామి... ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుమూల పల్లెలను అభివృద్ధి చేయడంతోపాటు అక్షరాస్యతను పెంపొందించేందుకు జీయరు ఆశ్రమం చేస్తోన్న సేవలు ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకున్నాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటూ వస్తోన్న ఈ ఆశ్రమం ఇంతవరకు తనవైపు ఎవరూ వేలెత్తి చూపించే పనులు చేయలేదు.

చరిత్రపై మరకలు?
అకస్మాత్తుగా జీయరుస్వామి చరిత్రపై మరకలు పడేలా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆశ్రమ కార్యక్రమాలతోపాటు కార్యకలాపాలు ప్రస్తుతం వివాదంగా మారాయంటున్నారు. చినజీయరు తర్వాత ఆయన మేనల్లుడు విష్ణు స్వామిదే పవర్. అతను విద్యాసంస్థలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో.. విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండే వారు. అనంతరం జీయరు ఆశ్రమానికి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించే బాధ్యతను తీసుకున్నాడు.

chinna jeeyar

ఉత్తరాధికారి విష్ణుస్వామేనా?
ఈ ఆశ్రమం మొత్తానికి జీయరు తర్వాత ఉత్తరాధికారి విష్ణుస్వామే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే విష్ణుస్వామి పగలు స్వామి వేషంలో ఉంటారని, సాయంత్రంవేళ పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతుంటారంటూ సోషల్ మీడియాలో పుంఖాను పుంఖలుగా వార్తలు వచ్చాయి. ఈ ఆశ్రమానికి ఉన్న నియమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అమెరికాలోను అనేక ఆశ్రమాలున్నాయి. అటువంటి సంస్థలో విష్ణు స్వామి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై జీయరు ఎలా స్పందిస్తారో తెలియరాలేదు.

chinna jeeyar

వివాదాలు తప్పవా?
చినజీయర్ తన ఆశ్రమంలో లేదా ట్రస్టుల్లో ఎవరిని నియమించుకుంటారు? ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు? అనే విషయం ఎవరికీ అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన రాజకీయ స్వామిగా మారారో అప్పుడే అందరికీ అవసరమైంది. మున్ముందు చినజీయర్ ఆశ్రమం విషయంలో మరిన్ని వివాదాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారదాపీఠం పేరుతో రాజకీయాలు చేసే స్వరూపానంద స్వామి కూడా తన మేనల్లుడు అయిన యువకుణ్ని తన తర్వాత ఉత్తరాధికారిగా నియమించి ఇప్పటికే జోరుగా శిక్షణ కూడా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+