జగన్‌ను పవన్‌తో పోల్చొద్దు, కుర్చీపై ప్రేమే తప్ప, జనంపై లేదు: చినరాజప్ప, పల్లె ఫైర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి చినరాజప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌కి సిఎం కుర్చీపై తప్ప, ప్రజలపై ప్రేమలేదని ఎద్దేవా చేశారు. రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా జగన్ ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు.
పవన్ కళ్యాణ్ కూడా భూసేకరణను వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘దయచేసి జగన్‌ను పవన్‌తో పోల్చవద్దు' అని కోరారు. పవన్ రైతుల మీద ప్రేమతో వారిని ఒప్పించి భూమి తీసుకోవాలని చెబుతుంటే.. జగన్ మాత్రం కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రత్యేక హోదాపై జగన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌లది కపటప్రేమని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. రక్షా బంధనం రోజు పండగ జరుపుకోనీయకుండా.. ధర్నాకు దిగటం జగన్ పైశాచికత్వానికి నిదర్శనమన్నారు.

హోదా సాధనలో చంద్రబాబు విఫలం: దేవినేని నెహ్రూ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించటంలో సిఎం చంద్రబాబు విఫలమయ్యారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ అన్నారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్ ఎదుట కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు.
ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
కేంద్రబడ్జెట్‌లో ఏపీకి నిధులు తీసుకురావటంలో టీడీపీ, బీజేపీలు విఫలమయ్యాయన్నారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.












Click it and Unblock the Notifications