కాంగ్రెస్‌కు అమరావతి షాక్: శంకుస్థాపనకు వద్దన్నందుకు రాజీనామా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయంపై షాక్ తగిలింది. అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ శాసనసభ్యుడు చిన్న రామకోటయ్య కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.
కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన రామకోటయ్య గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోవడంతో 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. అయినా పార్టీలోనే కొనసాగతూ వచ్చారు.

అమరావతి శంకుస్థాపనకు అన్ని పార్టీల నేతలు వస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. తన నియోజకవర్గ ప్రజలందరి తరపున తాను శంకుస్థాపనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ తమకు కలిసే అవకాశం ఇస్తే రాజధాని శంకుస్థాపనకు వెళ్లాలని ఎపి కాంగ్రెసు నాయకులు అనుకున్నారు. అయితే, ప్రధాని నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో వారు శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications