సీఎం ఫోటో వివాదం: బాబుకు చింతమనేని సారీ, బాధితుడి ఇంటికెళ్లి రాజీ
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఇటీవల హనుమాన్ జంక్షన్‌లో తాను వ్యవహరించిన తీరుపై ఆయన అధినేతకు క్షమాపణ చెప్పారని తెలుస్తోంది.
Recommended Video

కొద్ది రోజుల క్రితం బస్సుపై ఉన్న ఫోటోలో చంద్రబాబు ముఖం లేకపోవడంతో జరిగిన వివాదం నేపథ్యంలో ఒకరిపై చింతమనేని చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఇది వివాదమైంది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చింతమనేని గురువారం బాధితుడితో రాజీ కుదుర్చుకున్నారు.

గురువారం సాయంత్రం హనుమాన్ జంక్షన్ వచ్చిన చింతమనేని కొందరు స్థానిక నేతలతో కలిసి బాధితుడు నాగేశ్వర రావు ఇంటికి వెళ్లారు.
ఆ రోజు జరిగిన సంఘటన విచారకరమని, అనుకోకుండా జరిగిపోయిందన,ి దానిని పెద్దదిగా చేయవద్దని చింతమనేని ఆయన కోరారు. చింతమనేని స్వయంగా ఇంటికి రావడంతో బాధితుడు సంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications