వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనను అంతం చెయ్యాలని చూస్తున్నారని.. జ‌గ‌న్‌, స‌జ్జ‌ల‌, గౌతమ్ స‌వాంగ్‌ల‌పై చింత‌మ‌నేని ప్రైవేట్ కేసు

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రభుత్వం వేధిస్తున్నదంటూ ఆరోపిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసిపి ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని ఆరోపిస్తూ ప్రైవేటు కేసు దాఖలు చేశారు చింతమనేని ప్రభాకర్. ఈ మేరకు ఏలూరు కోర్టులో ఏపీ ప్రభుత్వం పై కేసు దాఖలు అయినట్టుగా తెలుస్తోంది.

జగన్, సజ్జలతో పాటు పోలీస్ అధికారులపై చింతమనేని ప్రైవేట్ కేసు

జగన్, సజ్జలతో పాటు పోలీస్ అధికారులపై చింతమనేని ప్రైవేట్ కేసు

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు రాహుల్ దేవ్ శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్, కృష్ణారావు, నలుగురు సిఐలు, ముగ్గురు ఎస్సైల పై కూడా ప్రైవేటు కేసు పెట్టారు. కోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

తనను అంతం చెయ్యాలని చూస్తోందని.. జగన్ సర్కార్ పై చింతమనేని ఆరోపణలు

తనను అంతం చెయ్యాలని చూస్తోందని.. జగన్ సర్కార్ పై చింతమనేని ఆరోపణలు

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ సర్కార్ తనను వేధింపులకు గురి చేస్తుందని, తనను అంతం చేయాలని చూస్తున్నారని, తనకు ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో తనను వేధిస్తున్న తీరు పై, తనకు ప్రాణహాని ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తనపై ఏకంగా 25 కేసులు నమోదు చేశారని చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు.

టిడిపి కార్యక్రమాలలో పాల్గొన్నా అదేదో నేరమన్నట్టు తనపై కేసులు

టిడిపి కార్యక్రమాలలో పాల్గొన్నా అదేదో నేరమన్నట్టు తనపై కేసులు


ప్రజా సమస్యలపై ఆందోళనలు చేసినా, టిడిపి కార్యక్రమాలలో పాల్గొన్నా అదేదో నేరమన్నట్టు తనపై కేసులు పెడుతున్నారంటూ చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. తనను టార్గెట్ చెయ్యటమే వైసీపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన మండిపడుతున్నారు.. ప్రభుత్వ పెద్దలతో పాటుగా, పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.

వైసీపీ సర్కార్ హయాంలో వరుసగా చింతమనేనిపై కేసులు

వైసీపీ సర్కార్ హయాంలో వరుసగా చింతమనేనిపై కేసులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని ప్రభాకర్ ను వరుసగా టార్గెట్ చేస్తూ కేసులు పెట్టింది. గతంలో చింతమనేని ప్రభాకర్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. అనేక కేసులలో చింతమనేని ప్రభాకర్ హై కోర్టును ఆశ్రయిస్తే, అక్కడ ఆయనకు ఊరట లభించింది. అయినప్పటికీ తను రాజకీయంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, నిత్యం కేసులతో వేధిస్తున్నారని,గతంలో తనను ఎన్కౌంటర్ చెయ్యాటానికి కూడా ప్రయత్నం చేశారని, తనకు వైసీపీ నాయకులతో, అధికారులతో ప్రమాదం పొంచి ఉందని చింతమనేని ప్రభాకర్ పై ప్రైవేట్ కేసును వేసినట్టు సమాచారం.

English summary
A private case has been filed by tdp leader chintamaneni prabhakar against Jagan mohan reddy, Sajjala ramakrishna reddy, and former dgp Gautam Sawang and other police officers as they wanted to kill him. The court will hold a hearing on this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X