వేధించిన వారికే పట్టం- చింతమనేని సంచలనం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయంగా - పాలనా పరంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతోంది. ఈ సమయం లోనే ప్రభుత్వం కొంత మంది నియామకాల్లో తీసుకున్న నిర్ణయాల పైన టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు కూటమి నేతల్లో ఈ వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది.
అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. పలు ఆసక్తి కర అంశాలను ప్రస్తావిం చారు. తమపై కేసు పెట్టి వేధించిన అధికారులు ఇప్పుడు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో తన పైన 27 కేసులు నమోదు అయ్యాయని చింతమనేని వివరించారు. పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. తన పైన నమోదైన కేసుల్లో న్యాయస్థానం రెండు కేసులు కొట్టివేసిందన్నారు. మరో 25 అక్రమ కేసులు తన పైన ఇప్పటికీ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

తన పైన అక్రమ కేసులు పెట్టిన అధికారులు అంతా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని చింతమనేని పేర్కొన్నారు. తనను వేధించిన అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారని వ్యాఖ్యానించారు. తనపై కొట్టేసిన రెండు కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసి పెట్టినవే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి సైతం తన పైన 14 అక్రమ కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. టీడీపీ గత హయాంలో చింతమనేని విప్ గా పని చేసారు. ఇప్పుడు చింతమనేని చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ వేళ కూటమి నేతల్లో చర్చగా మారాయి.












Click it and Unblock the Notifications