పొలిటికల్ రీ ఎంట్రీ సై మెగా డెసిషన్ - జనసేనతోనే..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల కూటమి ఏపీ లో ఎనిమిది నెలల పాలన పూర్తి చేసుకుంది. అటు మాజీ సీఎం జగన్ తిరిగి బలోపేతం కావటం పైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. వార్షిక బడ్జెట్ ద్వారా తన పాలన వేగం పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే మెగా స్టార్ చిరంజీవి రాజకీయంగా రీ ఎంట్రీ..పదవుల పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. తాజాగా చిరంజీవి తన రాజకీయ పునరాగమనం పైన తేల్చేసారు.
ప్రజారాజ్యం - జనసేన
మెగాస్టార్ చిరంజీవి తాజాగా లైలా సినిమా వేడుకలో నాటి ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని వ్యాఖ్యానించారు. దీని పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, నాటి ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తో జనసేన ఏర్పడిందనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అటు, బీజేపీ అధినాయకత్వం ఏపీలో మెగా బ్రదర్స్ తో రాజకీయంగా బలం పెంచుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుకు సిద్దమైంది. పవన్ ప్రమాణ స్వీకార వేదిక నుంచి చిరంజీవి - పవన్ తో మోదీ ప్రత్యేకంగా అభివాదం చేయటం ద్వారా భవిష్యత్ సంకేతాలు ఇచ్చారు. ఇక, ప్రధాని మోదీ .. బీజేపీ ముఖ్యులతో చిరంజీవి తరచూ భేటీలు ఈ సంకేతాలకు బలం ఇచ్చాయి.

తమ్ముడుతో కలిసి
చిరంజీవికి బీజేపీ నాయకత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. చిరంజీవి అంగీకరిస్తే కేంద్రంలో బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, ప్రజారాజ్యం పార్టీలో కాంగ్రెస్ లో విలీనం తరువాత చిరంజీవి కేంద్ర మంత్రిగా 2014 వరకు పని చేసారు. ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. తన సోదరుడు పవన్ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటా నని.. తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఇప్పుడు చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావటం తో పాటుగా జనసేన కోసం పని చేస్తారని.. బీజేపీ తో కలిసి ఏపీలో మెగా బ్రదర్స్ భవిష్యత్ రాజకీయం లో కీలకంగా వ్యవహరించబోతున్నారునే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు చిరంజీవి తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి స్పష్టత ఇచ్చారు.

చిరంజీవి క్లారిటీ
బ్రహ్మానందం కుమారుడు రాగా గౌతమ్ నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. 'నేను రాజకీయాల వైపు మళ్లీ వెళ్తానేమోనని పలువురు అనుకుంటున్నారు. 'పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు. ఏంటీ? అటువైపు ఏమైనా వెళ్తాడా?' అని కొందరు సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. జీవితాంతం కళామతల్లి సేవలోనే ఉంటాను. సినీరంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు, సేవలు నెరవేర్చేందుకు నా సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా'.. అంటూ చిరంజీవి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications