వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చిరంజీవే బలవంతుడు, పీఆర్పీ నలుగురి వ్యవస్థ, పవన్ ఓటమి ఖాయం'

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి 100 రెట్లు బలవంతుడు అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పవన్ కంటే చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ అని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు రాదన్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం, పరిణితి లేవని చెప్పారు. పీఆర్పీని చాలా దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఇప్పటి పవన్ కళ్యాణ్ కంటే ఆ రోజు చిరంజీవి వంద రెట్లు బలవంతుడన్నారు.

వివాదాలు లేని వ్యక్తి

వివాదాలు లేని వ్యక్తి

చిరంజీవికి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువని అని కేశినేని అన్నారు. ఇదే సమయంలో చిరంజీవి వ్యక్తిత్వం కూడా చాలా సున్నితమైనది అని చెప్పారు. ఆయన చాలా మృధు స్వభావి అని, ఎలాంటి వివాదాలు లేని వ్యక్తి అన్నారు. పీఆర్పీ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, నాగబాబు అందరూ కలసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్నారు.

Recommended Video

జనసేన లోకి చిరు ఫాన్స్
 పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారు

పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతారు

అలాంటి చిరంజీవికే 18 సీట్లు వచ్చాయని కేశినేని అన్నారు. తన సొంత స్థానంలోనే చిరంజీవి ఓడిపోయారన్నారు. పవన్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఆయన కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికలు టీడీపీకి చావుబతుకుల సమస్య అని, అప్పట్లో ఒక్క ఓటును కూడా తాము వదులుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే తమతో వచ్చే అందరినీ కలుపుకుని వెళ్లామన్నారు.

పవన్‌ను వదులుకోవాలని చంద్రబాబు అనుకోలేదు

పవన్‌ను వదులుకోవాలని చంద్రబాబు అనుకోలేదు

వన్‌ను వదులుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదని కేశినేని చెప్పారు. పవన్ లేవనెత్తిన సమస్యలను అన్నింటిని చంద్రబాబు పరిష్కరించారని తెలిపారు. ఒక మిత్రపక్షంగానే జనసేనాని చెప్పిన వాటిని చంద్రబాబు చేశారని తెలిపారు. ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకుని చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను విమర్శిస్తున్నారన్నారు.

అందుకే అలా వ్యవహరిస్తున్నారు

అందుకే అలా వ్యవహరిస్తున్నారు

స్థిరత్వం, పరణతి లేకపోవడం వల్లే పవన్ అలా వ్యవహరిస్తున్నారని కేశినేని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే మిగిలిన ఎంపీల మద్దతును కూడగడతానని ఆయన చెప్పారని, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారన్నారు. అంటే, బీజేపీతో కుమ్మక్కయ్యారా అన్నారు.

English summary
Chiranjeevi is great leader than Pawan Kalyan, says Telugudesam Party MP Kesineni Nani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X