చిరంజీవి వారసత్వంపై వ్యాఖ్యల దుమారం... వైసీపీ నేత, యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్!
పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీ,వి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తాజాగా వారసత్వంపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడిన చిరంజీవి ఇంటి నిండా అమ్మాయిలే ఉన్నారని, ఒక లేడీస్ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నట్లుగా ఉందని చరణ్ ఈసారైనా అబ్బాయిని కనరా.. లెగసి కంటిన్యూ అవుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి.
వారసుడు అంటే కొడుకేనా? శ్యామల ప్రశ్న
తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తనదైన శైలిలో స్పందించారు. కేవలం కొడుకుని వారసుడు అనడం సబబు కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వారసురాలిగా కూతురుని కూడా పరిగణనలోకి తీసుకోవాలని యాంకర్ శ్యామల తెలిపారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు అర్థం కాలేదని వారసుడు అంటే కొడుకే అవుతాడా .. కూతురు అవ్వదా అంటూ ఆమె ప్రశ్నించారు.

ఆ ఆలోచన నుండి అందరూ బయటకు రావాలి
చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అనే ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందని యాంకర్, వైసిపి అధికార ప్రతినిధి శ్యామల అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలు ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఆలోచనలు సరికాదని ఆమె పేర్కొన్నారు.
ఉపాసనపై యాంకర్ శ్యామల వ్యాఖ్యలు
ఇక చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళ కోడలు ఉపాసనను చూస్తే ఆమె ఒక డైనమిక్ లేడీ అని, డైనమిక్ ఉమెన్ గా ఓ సంస్థను ఎంత చక్కగా నడిపిస్తున్నారో తెలిసిందేనని పేర్కొన్నారు. ఉపాసన వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ సోదరీమణులు కానీ ఎంత ఎదిగారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అని యాంకర్ శ్యామల అభిప్రాయం వ్యక్తం చేశారు.
వారసత్వం కూతురిదైనా కావచ్చు
ఇక అందుకే వారసుడు ఎవరైనా కావచ్చు.. కొడుకే కానక్కరలేదు అనేది తన అభిప్రాయమని వైసిపి అధికార ప్రతినిధి శ్యామల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జెండర్ ఈక్వాలిటీని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తున్న తరుణంలో లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్న సమయంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి, లక్షల మందిని ప్రభావితం చేయగల స్టార్ హీరో ఆడపిల్లలను తక్కువ చేసేలా చేసిన వ్యాఖ్యలు పలువురి విమర్శలకు కారణంగా మారాయి.












Click it and Unblock the Notifications