వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరివాడినే: దాసరి, ముద్రగడ భేటీలో చిరంజీవి, ‘పవన్ వస్తే కాదనం’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కాపు సమాజానికి రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని, ఎవరికీ బెదిరేది లేదని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు. తమ ఆందోళనను కొత్త పంథాలో ముందుకు తీసుకు వెళ్లేందుకు గత రెండు నెలలుగా ముమ్మరంగా కాపు నేతలతోనూ, ఇతర కులాల నేతలతో చర్చలు జరుపుతున్న ముద్రగడ పద్మనాభం మంగళవారం నాడు దాసరి నారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు, అంబటి రాంబాబులతో సమావేశం అయ్యారు.

తనతో పాటు కాపునేతలు యేసుదాసు వాసిరెడ్డి, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, తోట రాజీవ్ తదితరులను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు కొనసాగాయి. రాష్టస్థ్రాయి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఈ భేటీ అనంతరం ముద్రగడ పద్మనాభం న్యాయవాదులతోనూ, కాపు ప్రముఖులతోనూ వేర్వేరుగా సమావేశం అయ్యారు. కొందరు ఇతర కులాలకు చెందిన రాజకీయ నేతలతోనూ భేటీ అయ్యారు.

సమావేశం అనంతరం ముద్రగడ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల కోసం తాము చేస్తున్న ఉద్యమానికి నేతలందరూ మద్దతు తెలిపారని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారన్నారు.
సెప్టెంబర్ 11వ తేదీన రాజమహేంద్రవరంలో కాపు ఐకాస సమావేశాన్ని నిర్వహించి ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.

ఈ సమావేశం ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలను అదేనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో కాపు నేతలతో మరోసారి సమావేశమై చర్చిస్తామని వెల్లడించారు. తనని అరెస్టు చేసినప్పటి విషయం గురించి చెబుతూ మాజీ మంత్రి అయిన తనపట్ల ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరించిందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఉద్యమంలోకి వస్తే కాదనమని చెప్పారు.

చిరు, దాసరి, ముద్రగడ, బొత్స

చిరు, దాసరి, ముద్రగడ, బొత్స

కాపులను బీసీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోనందువల్లే తామంతా రోడ్లపైకి రావల్సి వచ్చిందనీ... తానేమీ తీవ్రవాదిని కాదనీ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఎవరికీ బెదిరేదిలేదని, ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబుని ఆ విషయం అడుగుతుంటే ఆయనకు కోపం వస్తోందని విమర్శించారు.

నా వెనక జగన్ లేరు: ముద్రగడ

నా వెనక జగన్ లేరు: ముద్రగడ

‘నా వెనకాల జగన్‌, ఇంకెవరో ఉన్నారంటూ ఎంత కాలం నిందలేస్తారు? మీరు మాట ఇచ్చారు కాబట్టి రోడ్డుపైకి వచ్చాం. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. జగన్‌కు సుమారు 43 ఏళ్లు ఉండొచ్చు. ఆయన నా కంటే సీనియర్‌ అయి ఉంటే సలహాలు తీసుకుని ఉండేవాణ్ని' అని ముద్రగడ విస్పష్టంగా పేర్కొన్నారు.

కంటి తుడుపు చర్యే: దాసరి

కంటి తుడుపు చర్యే: దాసరి

‘కాపుల ప్రయోజనాల కోసం ముద్రగడ పట్టువదలని రీతిలో పోరాడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేసినా కుటుంబంతో సహా ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధమేనని ఆయన మా సమావేశంలో చెప్పారు. పరిస్థితిని ప్రభుత్వం అంత వరకూ తీసుకురాకూడదని డిమాండ్‌ చేస్తున్నాం. కాపులు కొత్తగా అడుగుతున్నదేమీ లేదు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమనే అడుగుతున్నారు. మంజునాథ కమిషన్‌ ఏర్పాటు కంటితుడుపు చర్యగా అనిపిస్తోంది. సమయం ముగిసిపోతున్నా...ఆ కమిషన్‌ రాష్ట్రంలో పర్యటించిన దాఖలాలు లేవు. ముద్రగడ సెప్టెంబర్ 11న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు''అని దాసరి నారాయణరావు పేర్కొన్నారు.

ఎప్పుడూ అందరివాడినే: చిరంజీవి

ఎప్పుడూ అందరివాడినే: చిరంజీవి

‘అందరివాడినని అంతా తొలుత అనేవారు, తర్వాత నేను కొందరివాడినే అన్నారు, వాస్తవానికి నేను ఎప్పుడూ అందరివాడినే' అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమంతోనే కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కమిషన్‌ను వేసిందని, కార్పొరేషన్ ఏర్పాటైందని చిరంజీవి చెప్పారు. తన కుటుంబం ఎంత ముఖ్యమో మిగిలిన వారు కూడా తనకు అంతే ముఖ్యమని చిరంజీవి పేర్కొన్నారు.

English summary
Congress MP Chiranjeevi on Tuesday met former union minister Dasari Narayana Rao over Kapu Meet and Mudragada padmanabham also there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X