వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"MAA" వివాదం పీక్‌: "మెగా" జడ్జిమెంట్ రెడీ: సీనియర్లతో చిరు బిజీబిజీ..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

"మా" ఎన్నిక వ్యవహారం ఇప్పుడు సాధారణ ఎన్నికల తరహాలో ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటోంది. అధ్యక్ష బరిలో నిలుస్తున్నానంటూ అయిదుగురు అభ్యర్ధులు ముందుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ ఏకంగా తన ప్యానెల్ ను సైతం ప్రకటించారు. మెగా సోదరుడు నాగబాబు పూర్తిగా ప్రకావ్ రాజ్ కు మద్దతుగా ఉన్నారు. మెగా బ్రదర్స్ లో చిరంజీవి మూడ్ ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ, "మా" లో జరుగుతన్న పరిణామాల పైన మాత్రం ఆయన ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో..ఒక పరిష్కార మార్గం సైతం సిద్దం చేసినట్లు చెబుతున్నారు.

వేడెక్కుతున్న

వేడెక్కుతున్న "మా" రాజకీయం..

ఇదే సమయంలో నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు..ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ రియాక్షన్ తో వేడి మరింత పెరిగింది. ఇక, తెలంగాణ వాదం సైతం తెర మీదకు వచ్చింది. మరో వైపు మంచు విష్ణు ఇప్పుడు "మా" బరిలో కీలకంగా మారారు. ఆయనకు ప్రముఖ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. దీంతో..ఆయన ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న "మా" బిల్డింగ్ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. బాలయ్య సైతం మద్దతుగా నిలిచారు. ఇక, విష్ణు పరోక్షంగా ప్రకాశ్ రాజ్ ను టార్గెట్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తరహాలోనే "మా" లోనూ సభ్యులుగా ఉన్న వారే పోటీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

 ఏకగ్రీవం సాధ్యమేనా..

ఏకగ్రీవం సాధ్యమేనా..

ప్రకాశ్ రాజ్ చేసే సేవా కార్యక్రమాల గురించి మద్దతు దారులు గొప్పగా చెబుతున్న సమయంలో విష్ణు మరో వ్యాఖ్య చేసారు. తాను..మహేష్ బాబు అనేక గ్రామాలు దత్తత తీసుకున్నామని..కరోనా సమయంలో నరేశ్ చాలా సాయం చేసారంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. మురళీ మోహన్ వంటి వారు "మా" ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఏకగ్రీవం అనే దానికి విలువ లేదని తేల్చి చెప్పారు. దీనికి ప్రతిగా విష్ణు...సినీ పెద్దలు అందరూ నిర్ణయిస్తే తాను ఏకగ్రీవానికి సిద్దమని ప్రకటించారు.

 తీవ్ర వ్యాఖ్యలతో మరింత వివాదం..

తీవ్ర వ్యాఖ్యలతో మరింత వివాదం..

దీనికి కొనసాగింపుగా...అర్ద్రరాత్రి అండర్ వేర్ తో స్టేషన్ లో కూర్చొబెట్టిన సమయంలో..తాము వారిని బయటకు తెచ్చామని..అతి చేస్తే పేర్లు బయట పెట్టాల్సి వస్తుందంటూ విష్ణు చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో ఎన్నికలు వాయిదా వేసి..అడహక్ కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అయితే, ఇప్పుడు బాధ్యత అంతా క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ క్రిష్ణంరాజు చేతిలో ఉంది. ఆయన తన కమిటీలో సభ్యులకు ఈ అంశంపైన లేఖలు రాసారు. సభ్యుడిగా చిరంజీవి రాజీనామా చేసినా..అది ఆమోదం పొందలేదు.

మెగ జడ్జిమెంట్ ఎప్పుడు..

మెగ జడ్జిమెంట్ ఎప్పుడు..

అయితే, తెలుగు సినీ పరిశ్రమ వ్యవహారాల్లో అన్నయ్యగా వ్యవహరిస్తున్న చిరంజీవి ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు "మా" లో కీలకంగా మారింది. అందరి చూపు చిరు వైపే. ప్రకాశ్ రాజ్...మోహన్ బాబు.. జయసుధ,..పోటీలో ఉన్న వీరితో చిరంజీవికి సత్సంబంధాలు ఉన్నాయి. వారిలో ఎవరూ చిరంజీవి మాట కాదనలేని పరిస్థితి. చిరంజీవి ఏ ప్రతిపాదన చేసినా..వారిని ఒప్పించగల సామర్ధ్యమూ మెగాస్టార్ కు ఉందనేది సినీ ఇండస్ట్రీ టాక్. అయినా..చిరంజీవి మౌనంగా ఉంటున్నారు. పరిస్థితులను గమనిస్తున్నారు.

Recommended Video

MAA Passes New Rule, Actors Remuneration To Be Reduced By 20 Percent | Oneindia Telugu
 చిరంజీవి మదిలో ఉంది అదేనా...

చిరంజీవి మదిలో ఉంది అదేనా...

అయితే, ప్రకాశ్ రాజ్ నే అధ్యక్షుడిగా చేయాలనేది చిరంజీవి కోరుకుంటున్నారనేది మరో ప్రచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాడు దాసరి నారాయణ రావు పెద్దాయనగా సినీ ఇండస్ట్రీలో సమస్యలను ఎలా పరిష్కరించారో ..ఆ స్థానం ఇప్పుడు చిరంజీవి భర్త చేస్తారా..లేక, దూరంగా ఉంటారా అనేదీ సందేహమే. అయితే, కొందరు సినీ పెద్దలతో మాత్రం చిరంజీవి ఈ "మా" ఎన్నికల వ్యవహారానికి సాధ్యమైనంత ముగింపు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఇందు కోసం ఒక మహిళతో అడహక్ కమిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆ సీనియర్ నటిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు మెగా అడుగులు ఏ రకంగా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
MAA Elections controversy is in peak stage. ALl are waiting for Chiranjeevi decision to end this issue. MEgastar may come with new decision shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X