లోపల భగభగ మండుతోంది: చిరంజీవి, మునికోటి అంత్యక్రియలకు హాజరు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై జరుగుతున్న వ్యవహారం వల్ల లోపల భగభగ మండుతోందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్తార్ చిరంజీవి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునికోటి అంత్యక్రియలకు ఇతర నాయకులతో కలిసి ఆయన సోమవారంనాడు హాజరయ్యారు.

మునికోటి ఆత్మహత్య చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఐదు కోట్ల ప్రజల ప్రయోజనం కోసం మునికోటి చేసిన త్యాగంగా ఆత్మహత్యను చూస్తున్నామని ఆయన అన్నారు. మునికోటి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు కృషి చేయాలని ఆయన అన్నారు.

మునికోటి మృతితోనైనా కేంద్రం, ప్రధాని మోదీ కళ్లు తెరవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, మునికోటి ఆత్మహత్యపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారని చిరంజీవి గుర్తు చేశారు. మునికోటి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు అందరం కలిసి పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. మత హక్కు తమకు రావాలని తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రేపు (మంగళవారం) తలపెట్టిన బంద్‌కు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Chiranjeevi says public is angry on special status issue

రేపు ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని సిపిఐ నేత రామకృష్ణ ప్రజలను కోరారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బంద్ సక్సెస్ అయితే ఫలితం ఉంటుందని తెలిపారు. రేపటి బంద్‌లో తిరుపతిని మినహాయిస్తున్నామన్నారు.

హోదా కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా వస్తుందని ఆయన వివరించారు. హోదాపై పార్లమెంటరీ కమిటీ వేసేందుకు కుట్ర జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ఆధ్వర్యంలో రాజమండ్రి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపటి బంద్‌ను ప్రజలు విజయవంతం చేయాలని, ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కారెం శి వాజీ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+