అందుకే జగన్ ఫ్యామిలీ: చిరు, 2019లో వస్తాను: పవన్
విజయనగరం/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి, వాటిని దాచుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ రాజకీయాల్లోకి దింపారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర ప్రచార సారథి చిరంజీవి ఆదివారం ఆరోపించారు. ఆయన విజయనగరం జిల్లాలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికలు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చివరి ఎన్నికలన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. సమస్యలను పరిష్కరించమని వేడుకున్న రైతుల చేతులకు సంకెళ్లు వేసిన చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో సమాధి కట్టాలన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని, ప్రజల్ని ఓట్ల అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన
జనసేన పార్టీ 2019లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఇప్పుడు మాత్రం ఎన్డీయేకు మద్దతు పలుకుతోందని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ టిడిపి, బిజెపి అభ్యర్థులు, చిలకలూరిపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తన జనసేన కోసం, జనసేనలోని అభిమానుల కోసం తాను ముందుండి పోరాడతానన్నారు. తెరాస చీఫ్ కెసిఆర్ సీమాంధ్రులను తిడుతుంటే జగన్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడంతో తాను జనసేన పార్టీని స్థాపించానన్నారు.












Click it and Unblock the Notifications