నా పైనేనని ప్రచారం.. కాదు: చిరంజీవి Vs లగడపాటి

Lagadapati Rajagopal and Chiranjeevi
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ల మధ్య శనివారం స్వల్ప వాగ్వాదం జరిగింది. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సమయంలో చిరు, లగడపాటిల మధ్య వాగ్వాదం జరిగింది.

సమావేశంలో లగడపాటి విమర్శలను చిరంజీవి ప్రస్తావించారు. ఇటీవల రాజగోపాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్రాన్ని విభజించాలని కొందరు సీమాంధ్రకు చెందిన పెద్ద నేతలో అధిష్టానానికి చెప్పారని, తెలుగు తల్లిని మావాళ్లే నరికేయమని చెప్పారని, తగిన సమయంలో వారి పేర్లను వెల్లడిస్తానని చెప్పారన్న వ్యాఖ్యలను చిరు ప్రస్తావించారు.

లగడపాటి ఆ వ్యాఖ్యలను చిరు ఘాటుగా ప్రస్తావించారట. తనను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశావని చిరు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనికి లగడపాటి స్పందిస్తూ.. తాను చిరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అందుకు చిరు ప్రతిస్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని హితువు పలకడంతో లగడపాటి సరే అన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, సిడబ్ల్యుసి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే భవిష్యత్తు కార్యాచరణపై సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. విభజన జరిగితే పార్టీని వదులుకునేందుకు, రాజీనామాలకు కూడా సిద్ధమని వారు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+