హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీలక మలుపు తిరిగిన ''చిరంజీవి vs గరికపాటి'' వివాదం?!

|
Google Oneindia TeluguNews

విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని దశాబ్దాలుగా 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు నటుడు చిరంజీవినుద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. కార్యక్రమం తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించి ట్వీట్ చేయడం.. లాంటి సంఘటనలన్నీ వరుసపెట్టి జరిగాయి.

నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్

నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్

చిరంజీవి ఇమేజ్ చూసి గరికపాటి అసూయ చెంది అలా వ్యాఖ్యానించారంటూ నాగబాబు ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలకు ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చిత్ర వ్యాపారం తప్ప సమాజ హితం పట్టని చిరంజీవిని చూసి గరికపాటి నరసింహారావు అసూయ చెందడమంటే ఆకాశం మీద ఉమ్మేయడంలాంటిదన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో చిరంజీవి గురించి ఎటువంటి ట్రోల్ జరగకపోయినా గరికపాటి నరసింహారావుతోపాటు నాగబాబుపై ట్రోలింగ్ జరిగింది. గరికపాటి తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రవచనాలు అడ్డుకుంటామంటూ చిరంజీవి యువత ప్రకటించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్


మూడురోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో చూసినవారు కూడా గరికపాటి నరసింహారావే కాస్తంత సంయమనం పాటిస్తే సరిపోయేదనే అభిప్రాయాలు వచ్చాయి. చిరంజీవి స్టార్ ఇమేజ్ ఉన్న మాస్ కథానాయకుడు కాబట్టి వారు ఫొటో దిగడానికి ఉత్సాహం చూపించారని, అనవసరంగా ఈ వివాదాన్ని పెద్దదిగా చేయకుండా ఉంటే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానించారు. దీంతో వివాదానికి స్వస్తి పలకాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.

పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి

పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి


ఈలోగా గరికపాటి చిరంజీవికి ఫోన్ చేశారు. తాను ఏ ఉద్దేశంతో అలా అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అంతేకానీ వ్యక్తిగతంగా కావాలని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించలేదని, తానే కాస్తంత సంయమనం పాటిస్తే సరిపోయేదని అన్నట్లు తెలిసింది. చిరంజీవి కూడా గరికపాటికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తాను జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుండేదని, కానీ అలా చేయలేదనడంతో గరికపాటి వారించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒకటి రెండురోజుల్లో వివాదానికి స్వస్తి పలకాలంటూ ఒక వీడియో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

English summary
Chiranjeevi decided to end the garikapati narasimaharao dispute issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X