కత్తితో పొడిచి, గన్‌తో కాల్చి: చిత్తూరు మేయర్ అనురాధ హత్య, కర్నాటక వాళ్లా?

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు నగర పాలక మేయర్ కటారి అనురాధ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. ఆమె భర్త మోహన్ పైన కూడా హత్యాయత్నం జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. నగర పాలక కార్యాలయంలోనే మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

కర్నాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితులు వచ్చిన వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ ఉండటంతో అనుమానిస్తున్నారు. అయితే అందులో వచ్చింది ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనలో అనురాధ మృతి చెందారు. చిత్తూరు నగర పాలక కార్యాలయంలోనే ఈ సంఘటన జరిగింది. దుండగులు మేయర్ అనురాధ ఆమె భర్త మోహన్ పైన కత్తులతో దాడి చేసి, తుపాకీతో కాల్చారు.

Chittoor Mayor Anuradha injured

తీవ్రంగా గాయపడ్డ భర్త మోహన్‌ను చిత్తూరు టూ టౌన్ పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవాహం బురఖా ధరించి వచ్చిన ముగ్గురు వ్యక్తులు చిత్తూరు కార్పోరేషన్ ఆవరణలో అనురాధ పైన రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు.

దీంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందారని తెలుస్తోంది. ఆమెను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. పక్కనే ఉన్న కటారి మోహన్ పైన దుండకులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

మోహన్‌ను పోలీసులు వెంటనే వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయారని చెబుతున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+