సెల్‌ఫోన్లో నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డ సీఐ, సస్పెండ్
విజయవాడ/హైదరాబాద్: బెజవాడ ఇంద్రకీలాద్రి పైన కొలువుదీరిన కనకదుర్గమ్మ గుడి పవిత్రతను ఓ సీఐ మంటకలిపాడు. సీఐ గుడి ఆవరణలో తన మొబైల్ ఫోన్‌లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కాడు. మూలానక్షత్రం రోజున భక్తుల కోలాహలం మధ్య సీఐ ప్రసాద్ నగ్నచిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు.
ఓ మూలన తాపీగా కూర్చున్న సీఐ తన సెల్‌ఫోన్లో నగ్న చిత్రాలు చూసుకుంటూ గడిపాడు. అతని పైన భక్తులు మండిపడుతున్నారు. బందోబస్తు విధుల్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని భక్తులు సదరు సీఐపై మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీపై కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజయవాడ శాంతిభద్రతల డీసీపీని ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేశారు. కాగా, ఈ రోజు అమ్మవారు సరస్వతీ రూపంలో కనిపించనుంది. దీంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
సాయినగర్‌లో దారుణ హత్య
ఎల్బీ నగర్ సమీపంలోని సాయి నగర్ కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని బండరాళ్లతో మోదీ హతమార్చారు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సిఐ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications