టీడీపీ హయాంలో స్కాం- కీలక అధికారికి నోటీసులు : టార్గెట్ ఫిక్స్..!!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈ స్కాం విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రమేయం ఉన్న పలువురిని విచారణ సంస్థలు విచారించాయి. ఇప్పుడు ఏపీఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో త్వరలో అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది. రాజకీయంగా ఇప్పుడు ఈ విచారణ కొత్త చర్చకు కారణమవుతోంది. టీడీపీ నేతలు ఇదంతా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ఆరోపణలుగా కొట్టిపారేస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్
టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ఆసక్తి కర మలుపులు తీసుకుంటోంది. ఈ స్కాంలో తెర వెనుక కీలక వ్యక్తులు ఉన్నారని అనుమానిస్తున్నారు. దాదాపు రూ 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కాం లో సూత్రధారులు ఎవరనే అంశం పైన ఇప్పుడు విచారణ సాగుతోంది. నాటి సంస్థ ఎండీ శ్రీకాంత్ అర్జాను విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. తమ ప్రభుత్వంలో స్కాం జరిగిందంటూ ఆరోపించటం పైన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతే.. సీమెన్స్‌కు ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లించారని చెప్పుకొచ్చారు.
ఆరోపణలను ఖండిస్తున్న టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దారి మళ్లించటం కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లు ప్రాజెక్టు పైన ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సీమెన్స్ - డిజిటల్ టెక్ ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వం నుంచి 10శాతం మేర చెల్లింపులు జరిగాయి. మిగిలిన 90 శాతం సీమెన్స్ చెల్లిస్తుందన్న ఒప్పందం చేసుకున్నారు. 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు నాటి ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బును వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లింపు జరిగినట్లు విచారణలో గుర్తించారు. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు ఈ డబ్బు మళ్లినట్లుగా తేల్చారు. రూ. ౩౭౦ కోట్లలో రూ.240 కోట్లు రూటింగ్ జరిగిందని విచారణలో తేల్చారు.

ఆధారాలు సేకరించిన సీఐడీ
కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. ఈ స్కాంపై కేంద్రం ఆదాయపుపన్ను శాఖ దృష్టిపెట్టింది. గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నెల్ టీంకూడా మా కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని తేల్చారు. సీఐడీ ఈ సంస్థల నుంచి సమాచారం సేకరించింది. ఆధారాలు లభ్యం అయినట్లు సమాచారం. సీమెన్స్ నేరుగా వచ్చి వివరణ ఇచ్చింది. సీమెన్స్ పేరిట మోసాలు జరిగినట్లుగా గుర్తించారని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు నోటీసులు..విచారణ..అరెస్టుల దిశగా సీఐడీ సిద్దం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.సిద్ధం












Click it and Unblock the Notifications