తుని విధ్వంసంలో కీలక మలుపు: వైసీపీ నేత భూమనకు సీఐడీ నోటీసులు
అమరావతి: తుని విధ్వంసం కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనవరి 31న తునిలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన కాపు గర్జన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో నెంబర్ వన్ న్యూస్ చానెల్ యజమాని సుధాకర్‌నాయుడు కూడా ఉన్నారు.

తుని ఘటనకు సంబంధించి ఈనెల 4న గుంటూరు, రాజమహేంద్రవరంలోని కార్యాలయాల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఐడీ నోటీసులు అందుకున్న భూమన కరుణాకరరెడ్డి 6వ తేదీన విచారణకు హాజరవుతానని సమాధానమిచ్చారు.
ఈ కేసుకు సంబంధంచి మొదటి దఫాలో భాగంగా ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసిన వారంతా అమాయకులని, వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ముద్రగడ ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో దఫాగా 20 మందికి నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న అనంతరం భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుని కేసులో తనకు నోటీసులివ్వడాన్ని దురుద్దేశపూర్వక కుట్రగా అభివర్ణించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కారు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications