విజయసాయిరెడ్డికి బిగ్ షాక్..ఆ కేసులో బుక్ అయ్యారా..?
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై 506,384, 420,109,467,120(b)రెడ్ విత్ 34 BNS సెక్షన్లు నమోదు చేశారు.ఈ నెల 12న సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి అధికారులు నోటీజులు జారీ చేశారు. సీఐడీ జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన సీఐడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు కాకినాడ పోర్టులో భారీగా అవకతకలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. సీఐడీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీనే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసులు చుట్టుముడుతూండటంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ బీచ్ విషయంలో ఇప్పటికే ఆయన కూతురిపై కేసు నమోదైంది. దీనికి తోడు కాకినాడ పోర్టు వ్యవహారం మెడకు చుట్టుకోవడంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ గెలుపోటముల్లో విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉన్నారు. పార్టీలో జగన్ తర్వాత స్థానం ఆయనదే. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు బిగ్ షాకిచ్చింది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం, పైగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. మొత్తానికి ఆయన తన రాజ్యసభ పదవితో పాటు, పార్టీలోని పదవులకు సైతం రాజీనామా చేశారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని .. భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలో తెలిపారు.












Click it and Unblock the Notifications