నోరు తెరిస్తే అజ్ఞానం: పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి సంచలన ట్వీట్
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై ఆయన తన వ్యాఖ్యల జోరు పెంచారు.
పవన్ కల్యాణ్ నోరు తెరిస్తే అజ్జానమేనని తాజాగా ఆయన ట్వీట్టర్‌లో వ్యాఖ్యానించారు. "బాబు పవన్ కల్యాణ్ రాజ్యంగ సంక్షోబం అనగానేమి? 10 మార్కుల ప్రశ్న.. సమాధానం చెప్పుడు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

దాంతో ఆగకుండా - "చంద్రబాబు నాయుడు పార్లమెంటు ముందు నిరసన చేసిన ఎడల, ఆ రాజ్యాంగ సంక్షోభం ఎలా ఏర్పడును? ఉప ప్రశ్న. 5 మార్కులు పూరింపుడు" అని అన్నారు.
"నోరు తెరిస్తే అజ్ఝానం, అజ్ఝానవాసీ సుఖీభవ!" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారంనాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తి తాజాగా పవన్ కల్యాణ్‌పై ఈ విధంగా విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications