డైలాగులు సూట్ కావు: బాబుపై హరీశ్, 7న మహాధర్నా

సీమాంధ్ర నాయకులు ఎంత అరిచిగీపెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగదని ఆయన తేల్చి చెప్పారు. ముగ్గురు బాబులు (ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి) సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లను తరిమికొట్టాలని ప్రజలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.
జనవరి 7న మహాధర్నా: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ పాలనను ఒప్పుకోమని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ముసాయిదా బిల్లులో సంపూర్ణ తెలంగాణ కోసం అవసరమైన సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 5న దోమలగూడలోని ఏవి కాలేజిలో తెలంగాణ న్యాయవాదుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సంపూర్ణ తెలంగాణ కోసం జనవరి 7న ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షను చేపడతామని చెప్పారు.
తాము నిర్వహించే మహాధర్నాకు పోలీసుల నుంచి అనుమతి కోరామని తెలిపారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరిగేందుకు, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు ఎమ్మెల్యేలు సహకరించాలని కోదండరాం కోరారు. ఇన్నాళ్లు లేని ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా వస్తాయని ఆయన ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులను ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications