హోటల్లో హైటెక్ వ్యభిచార ముఠా రట్టు, యువతి అరెస్ట్

ఫ్లై ఓవర్ పైన ప్రమాదం
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ పైన మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
స్పిరిట్ లారీ బోల్తా
కాకినాడ నుండి విశాఖపట్నం ఐవోసికి స్పిరిట్ తరలిస్తుండగా విశాఖ జిల్లా అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం సాయి నగర్ కాలనీ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో కెజిహెచ్‌కు తరలించారు. ట్యాంకర్ నుండి స్పిరిట్ నేలపాలైంది. గొయ్యి తవ్వి స్పిరిట్‌ను మళ్లించారు.
చిన్నారులు మృతి
విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడులో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చలి తీవ్రతకు తట్టుకోలేక వీరు మృతి చెందినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications