'తెలంగాణ సీఎం అణచివేత ధోరణి, బిజెపి పద్ధతి ప్రకారం రగుల్చుతోంది'
అనంతపురం: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ శేషయ్య మంగళవారం నాడు మండిపడ్డారు. ఆయన అనంతపురం జిల్లాలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ మీడియా పట్ల అణచివేత ధోరణిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు.

ఈ నెల 12, 13 తేదీల్లో గుంటూరులో పౌరహక్కుల సంఘం 17వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈసభలకు అంబేడ్కర్ మనవడు ఆనంద్, కాకతీయ విశ్వవిద్యాలయ ఉప కులపతి కాత్యాయని విద్మహే తదితరులు హాజరు కానున్నారని చెప్పారు.
దేశంలో మతం పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనిప్రభుత్వం పద్ధతి ప్రకారం విద్వేషాన్ని రగుల్చుతోందని ఆరోపించారు. మావోయిస్టు ఉద్యమం సహా ఇతర ప్రజా ఉద్యమాలు అణచివేతకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications