సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు - చెప్పాల్సినవి చాలా ఉన్నాయి : ఆ రోజు చెబుతా..!!
సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. సీజేఐగా ఎన్వీ రమణ మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన చెప్పాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి. అదే అంశాన్ని వివరిస్తూ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెబుతూ.. పదవీ విరమణకు ముందు ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదని స్పష్టం చేసారు. తన వీడ్కోలు ప్రసంగంలో అన్ని అంశాలను చెబుతానంటూ ఆసక్తి పెంచారు.
అప్పటి వరకు వేచి ఉండంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరు గురించి సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే చేసిన వ్యాఖ్యల సందర్బంలో సీజేఐ స్పందించారు. విచారణ జాబితాలో ఉన్న ఓ కేసును తొలగించడం పైన దవే వ్యాఖ్యలు చేసారు.చివరి నిమిషంలో అలా తొలగించడం న్యాయవాదులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందంటూ దవే సీజేఐ వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. తాము ముందు రోజు నుంచి కేసును వింటామని.. కక్షిదారులు, న్యాయవాదులతో ఎన్నోసార్లు మాట్లాడుతామని చెబుతూ.. అంతా అయ్యాక కేసు డిలీట్ అవటం ఇబ్బందిగా మారుతోందని దవే వివరించారు.

రిజిస్ట్రీ మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ సమయంలో జస్టిస్ ఎన్వీ రమణ తాను అన్ని విషయాలు పదవీ విరమణ సమయంలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అదే విధంగా.. ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రవాస భారతీయులకూ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో..సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ సమయంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications