అమరావతికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి - ఏపీలో మూడు రోజుల పర్యటన : స్వగ్రామానికి రాక..!!

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించటం దాదాపుగా ఇదే తొలి సారి. జస్టిస్ రమణ పలు మార్లు తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. అదే విధంగా డాలర్ శేషాద్రి మరణం సమయంలోనూ తిరుపతికి వచ్చి ఆయనకు నివాళి అర్పించారు. ఇక, ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సీజేఐ హోదాలో స్వగ్రామానికి

సీజేఐ హోదాలో స్వగ్రామానికి

ఈ నెల 24న ఆయన తాను పుట్టి పెరిగిన స్వగ్రామం కృష్ణాజిల్లా వీరులపాడు (మం) పొన్నవరం లో పర్యటిస్తారు. దీంతో..తమ గ్రామానికి చెందిన జస్టిస్ రమణ ఇప్పుడు దేశంలోని అత్యున్నత స్థానంలో ఉండటం పైన ఆ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ నియామకం సమయంలోనూ వారంతా సంతోషం పంచుకున్నారు. ఈ నెల 26న గుంటూరు - మంగళగిరి మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ హైకోర్టు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రెండవ న్యాయాధికారుల సదస్సుకు ఆయన హాజరవుతారు.

న్యాయాధికారుల సదస్సులో కీలక ప్రసంగం

న్యాయాధికారుల సదస్సులో కీలక ప్రసంగం

ఇదే యూనివర్సిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ డిగ్రీ పట్టా అందుకున్నారు. అదే రోజు ఆయన నేలపాడు లో ఉన్న ఏపీ ను సందర్శించనున్నారు. తాజాగా ఇదే ప్రాంతంలో అదనపు కోర్టు భవనం కోసం భూమి పూజ జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో 2015 విజయదశమి నాడు జరిగిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో నాడు ప్రధాని మోదీతో పాటుగా జస్టిస్ ఎన్వీ రమణ సైతం హాజరయ్యారు.

ఆ తరువాత 2019 ఫిబ్రవరిలో ప్రస్తుత హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ తో పాటుగా జస్టిస్ రమణ కూడా పాల్గొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి అయినాక అమరావతిలో

ప్రధాన న్యాయమూర్తి అయినాక అమరావతిలో

ఇప్పుడు అదే కోర్టును భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ సందర్శించనున్నారు. ఉమ్మడి ఏపీలో ఏపీ హైకోర్టుతో జస్టిస్ ఎన్వీ రమణకు సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం ఉంది. ఇక, తాజాగా హైదరాబాద్ లో తొలి సారిగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్..మీడియేషన్ కేంద్రాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ..మూడు రోజుల పాటు ఏపీలో పర్యటన ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+