నా ప్రవర్తనలో మార్పు ఉండదు - మాతృభాషలో చదివి ఈ స్థాయికి : సీజేఐ ఎన్వీ రమణ..!!

తెలుగువాడిగా సీజేఐ అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తెలుగు వారిని ఉద్దేశించి సీజేఐ ప్రసంగించారు. అమెరికాలో 2010-2017 మధ్య తెలుగు మాట్లాడేవారి సంఖ్య 85 శాతం పెరిగిందని.. మాతృభూమిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటు అందిస్తున్నారని వివరించారు. సమాజంలో అసమానతలు, అశాంతి తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని పేర్కొన్నారు.

ఎప్పుడూ ఒకే విధమైన ప్రవర్తన

ఎప్పుడూ ఒకే విధమైన ప్రవర్తన

అమెరికాలోని తెలుగు వారిని కలవటం సంతోషం ఉందని చెప్పారు. రాష్ఱ్రపతిని కలిసినా..చిన్న ఉద్యోగిని కలిసినా తన ప్రవర్తనలో మార్పు ఉండదని సీజేఐ స్పష్టం చేసారు. ఆడంబరాలు తనను ప్రభావితం చేయవని వివరించారు. ఎవరైనా జడ్జి పదవి చేపట్టాక రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా పనిచేస్తారన్నారు. న్యాయాన్ని నిలబెట్టేలా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. న్యాయ సమీక్ష చేసే అధికారం.. భారత దేశ న్యాయవ్యవస్థకు ఉందని వివరించారు. సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయటం చరిత్రగా అభివర్ణించారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను వేగంగా భర్తీ చేస్తున్నామని చెప్పారు.

ఐకమత్యంతో - గౌరవంతో

ఐకమత్యంతో - గౌరవంతో

సమాజంలో అనేక మతాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉంటారని..అందరం ఐకమత్యంతో కలిసి అందరినీ గౌరవిస్తూ వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అన్ని తరగతుల ప్రజలను సమానంగా గౌరవించాలని సూచించారు. తాను ఓ రైతు కుటుంబం నుంచి వచ్చానని, తమ కుటుంబంలో ఎవరూ పెద్దగా చదువుకోలేదని చెప్పారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా కష్టమన్న ఆయన.. పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉన్నందునే ఈ స్థాయికి వచ్చినట్లు వెల్లడించారు. తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవన విధానం, నాగరికతగా అభివర్ణించారు. ఎంత సంపాదించినా సమాజంలో అరాచకశక్తి ఉంటే ప్రశాంతంగా బతకలేమన్నారు.

మాతృభాషలో చదివి ఈ స్థాయికి

మాతృభాషలో చదివి ఈ స్థాయికి

తెలుగు భాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధగా ఉందని చెప్పారు. మాతృభాషలో ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనన్నసీజేఐ, తాను మాతృభాషలో చదివి ఈ స్థాయికి వచ్చాననేది మరచిపోవద్దని పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న తెలుగువారు ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని ప్రశంసించారు. దాదాపు ఏడు లక్షల మంది తెలుగు వారు ఉన్నారని.. అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారంటూ సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+