నోట్ల రద్దుపై జగన్ లో క్లారిటీ మిస్: బాబు సంగతి సరే! మిగతావారు..
జగన్ స్వయంగా చెబుతున్నట్టు.. చంద్రబాబే ముందుగా సర్దుకున్నారు అంటే.. మిగతా నల్లకుబేరులు మాత్రం ఎందుకు సర్దుకోరు?
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తున్నా.. ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ మాత్రం నిన్న మొన్నటిదాకా మౌనం వహిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే.. జగన్ ను టార్గెట్ చేసే టీడీపీ విమర్శలకు మరింత పదును పెట్టింది. జగన్ కు ఈడీ.. మోడీ.. భయం పట్టుకుందని ఊదరగొట్టింది.

ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేసిన జగన్.. మొత్తానికి నోట్ల రద్దుపై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే స్పందించడవ వరకు బాగానే ఉంది గానీ.. ఆయన స్పందనలో మాత్రం క్లారిటీ మిస్ అయినట్టే కనిపిస్తోంది. ఓవైపు సీఎం చంద్రబాబుకు నోట్ల రద్దు విషయం ముందే తెలుసంటూ.. ఆరోపణలు చేసిన జగన్.. మరోవైపు నోట్ల రద్దు అంశాన్ని చర్చకు పెట్టి, అందరి అభిప్రాయం తీసుకున్నాకే నోట్ల రద్దు చేసుండాల్సిందని అభిప్రాయపడడం.. జగన్ లో క్లారిటీ మిస్ కు కారణంగా కనిపిస్తోంది.
జగన్ స్వయంగా చెబుతున్నట్టు.. చంద్రబాబే ముందుగా సర్దుకున్నారు అంటే.. మిగతా నల్లకుబేరులు మాత్రం ఎందుకు సర్దుకోరు? అన్న క్లారిటీ జగన్ ఎలా మిస్ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ విమర్శలో స్పష్టత మిస్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications