రాళ్లు రువ్వుకున్న పరిటాల సునీత-ఎమ్మెల్యే సూరి వర్గీయులు, లాఠీఛార్జ్
అనంతపురం జిల్లాలోని ధర్మవరం తారకరామ నగర్‌లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ధర్మవరం తారకరామ నగర్‌లో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి.

వీరి ఘర్షణను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసుల పైన కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. వారిని చెదరగొట్టారు. పోలీసుల వాహనాలపై కూడా వారు రాళ్లు రువ్వారు. ధర్మవరంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications