పవన్‌కు ఇచ్చే విలువ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు లేదా చంద్రబాబూ

Jr NTR: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభ.. హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎప్పటికైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజకీయంగా తాము దూరంగానే ఉంచుతామనే సందేశాన్ని పంపించినట్టయింది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీ రా.. కదలిరా పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం తిరువూరులో ఈ సభను ఏర్పాటు చేసింది. చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సహా జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు ఇందులో పాల్గొన్నారు.

Clash broke out between TDP and Jr NTR supporters

ఇదే సభకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్టీఆర్ ఫొటోలను ముద్రించిన ప్లకార్డులు, బ్యానర్లను తమ వెంట తెచ్చుకున్నారు. సభ కొనసాగుతున్న సమయంలో వారు చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్‌కు కూడా అనుకూలంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఫొటోలను ప్రదర్శించారు.

దీన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ పేరు ఎత్త వద్దంటూ ఆదేశించారు. ఆయన పేరు వినిపించకూడదంటూ హుకూం జారీ చేశారు. దీనికి ఎన్టీఆర్ అభిమానులు అంగీకరించకపోవడంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఘర్షణకు దారి తీసింది.

Clash broke out between TDP and Jr NTR supporters

టీడీపీ కార్యకర్తలు- జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాహాబాహికి దిగారు. కొట్టుకున్నారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభా వేదికపైనే ఉన్నారు. సభా వేదిక సమీపంలోనే ఇరు పక్షాల వారు ఘర్షణ పడటం కనిపించింది. అయినప్పటికీ- వారిని వారించే ప్రయత్నం చేయలేదాయన.

ఈ వీడియోను మంత్రి అంబటి రాంబాబు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. చంద్రబాబుపై ఘాటు విమర్శలు గుప్పించారు. సీనియర్ ఎన్టీఆర్‌కు జోహార్లు అర్పించడం, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ అవమానించడం.. ఇదీ నారా పన్నాగం అంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+