బాబు బెదిరించారు, అమరావతికి రుణమిస్తే ఆత్మహత్య: ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu
  Farmers complained to the World Bank బాబు బెదిరించారు, అమరావతికి రుణమిస్తే ఆత్మహత్య | Oneindia

  అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం, నిధులు, వ్యయం తదితర అంశాల పరిశీలకు ప్రపంచ బ్యాంకు రాజధాని ప్రాంతంలో గురువారం పర్యటించింది. ఈ సందర్భంగా రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు.

  దొనకొండ ఎఫెక్ట్: 'అమరావతిని జగన్ అడ్డుకోవడానికి కారణం ఇదీ'

  బలవంతంగా లాక్కున్నారు

  బలవంతంగా లాక్కున్నారు

  రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ఎదుట తమ ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కారణంగా బంగారం వంటి తమ భూములు కోల్పోయామని చెప్పారు.

  ఎక్కువ ధరకు అమ్మకం.. బాబు ప్రభుత్వంపై సంచలన ఆరోపణ

  ఎక్కువ ధరకు అమ్మకం.. బాబు ప్రభుత్వంపై సంచలన ఆరోపణ

  మా వద్ద నుంచి భూమిని బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రూ.18 లక్షలు ఇచ్చి భూములు తీసుకున్నారని, వారు మాత్రం రూ.50 లక్షలకు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంచి భూములను నాశనం చేస్తున్నారన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోను భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు.

  వాటికి భూములిచ్చేందుకు సిద్ధం

  వాటికి భూములిచ్చేందుకు సిద్ధం

  మౌలిక సదుపాయాలకు భూములు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు చెప్పారు. గతంలో నెలకు తమకు రూ.12 వేలు గిట్టుబాటు అయ్యేదని, ఇప్పుడు మాత్రం నెలకు కేవలం రూ.2,500 మాత్రమే వస్తోందని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

  ధర పడిపోయింది

  ధర పడిపోయింది

  రాజధాని ప్రకటనకు ముందు నిడమర్రు, బేతపూడి గ్రామాల్లో సుమారు రూ.2 కోట్లున్న ఎకరం ధర, ప్రకటన తర్వాత రూ.కోటిన్నరకు పడిపోయిందని నిడమర్రు, కురగల్లు గ్రామాలకు చెందిన భూసమీకరణ, భూసేకరణలను వ్యతిరేకిస్తున్న రైతులు, వైసిపి, సీపీఎం నాయకులు ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు తెలిపారు.

  మంత్రులు భయపెట్టి తీసుకున్నారు

  మంత్రులు భయపెట్టి తీసుకున్నారు

  భూసమీకరణకు గ్రామంలో 730 ఎకరాలు ఇవ్వలేదని వైసిపి నాయకులు, రైతులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. మిగతా భూమిని ప్రభుత్వం, మంత్రులు రైతులను భయభ్రాంతులకు గురిచేసి తీసుకున్నారని ఆరోపించారు. భూసమీకరణలో పొలాలు ఇవ్వని రైతులమంతా హైకోర్టును ఆశ్రయించి, స్టే ఆర్డరు పొందామని బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు.

  రాజధానికి రుణం ఇస్తే ఆత్మహత్య

  రాజధానికి రుణం ఇస్తే ఆత్మహత్య

  రాష్ట్ర ప్రభుత్వానికి రుణమిస్తే తాము ఆత్మహత్యలు చేసుకుంటామని బ్యాంకు ప్రతినిధులను కొందరు హెచ్చరించారు. మరి మిగతా రైతులు భూములు ఎందుకిచ్చారని రైతులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశ్నించారు. రాజధాని ప్రాంత పశ్చిమ గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందని, ఏటా ఒక్క పంటే పండుతుందని, కొండవీటివాగు ముంపుతో పంటలు నష్టపోతారని, అక్కడి భూములకు పెద్దగా విలువ లేదని కొందరు రైతులు తెలిపారు. పూలతోటలు ఉంటే ఎకరానికి రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ వార్షిక ఆదాయం వస్తుందన్నారు. రైతులు చెప్పిన అంశాలను ప్రపంచ బ్యాంకుకు నివేదిస్తామని అధికారులు చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Divergent views over funding by external agencies for capital building greeted the visiting 4-member Inspection Panel of the World Bank.Gonzalo Castro de la Mata, Inspection Panel Chairman, Jan Mattsson, Panel Member, Dilek Barlas, executive secretary, and Birgit Kuba, Operations Officer, arrived in capital on Wednesday for a 3-day visit in a bid to give an outlet to the capital villagers in the wake of petitions raising objections over the World Bank’s move for a financial assistance of $3800 in US currency for infrastructure development in the capital region.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి